Saturday, 14 November 2026

వార్తలు

నేడు విద్యాసంస్థల బంద్‌కు పిలుపు

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. సంతోష్‌ అనే విద్యార్థి తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో స్వఛ్చందంగా విద్యాసంస్థలు మూసివేయాలని కోరింది, విద్యార్థులు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది.

కేకే రైల్వేలైన్‌ మార్గంలో మరోసారి విరిగిపడ్డ కొండచరియలు

విశాఖపట్నం : కిరండోలు-కొత్తవలస రైలు మార్గంలో చిమిడిపల్లి వద్ద మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా నాలుగు రోజుల క్రితం ఈ మార్గంలో కొండరాళ్లు విరిగిపడడంతో ప్యాసింజర్‌, గూడ్స్‌ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే సిబ్బంది ట్రాక్‌…

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ న్యాయమూర్తి మృతి

చెన్నై : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చైన్నైలో చికిత్స పొందుతున్న గుంటూరు రెండో అదనపు న్యాయమూర్తి ఎం.శ్రీనివాస్‌రెడ్డి మృతి చెందారు. ఈనెల 1న ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయన్ని చైన్నైలోని…

ముంపు ప్రాంతాల్లో హోంమంత్రి పర్యటన

అమలాపురం : కోనసీమలోని అమలాపురంలో నీలం తుపాను ప్రబావంతో ముంపునకు గురైన ప్రాంతాల్లో జిల్లా ఇంచార్జి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. నీట మునిగిన పోలిసు క్వార్డర్లను సందర్శించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చైతన్యరాజు…

అర్మీ రిక్రూట్‌మెంట్‌ పరుగు పరీక్షలో అపశ్రుతి

ప్రకాశం : ఒంగోలు పోలీసు కవాతు మైదానంలో జరుగుతున్న అర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. పరుగు పరీక్షలో ఓ అభ్యర్థి అయాసంతో సోమ్ముసిల్లి పడిపోయి మృతి చెందాడు. ఇతన్ని చీమకుర్తి మండలం చంద్రపాడుకు చెందిన కె. ప్రభాకర్‌గా…

నెల్లూరులో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ భేటీ

నెల్లూరు: ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు అధికారులు తీసుకుంటున్న చర్యలు పరిశీలించేందుకు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం. వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో పలువురు రాజ్యసభ, లోకసభ సభ్యులు నెల్లూరులో సమావేశమయ్యారు. హోటల్‌ హరితాలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ…

విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి

చిత్తూరు: సత్యవేడు మండలం రాజగోపాలపురం వద్ద విద్యుదాఘాతంలో ఇద్దరు రైతులు మృతి చెందారు. పొలం పనులు చేస్తుండగా విద్యుత్‌ తీగలు తగిలి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అమెరికాలో మిన్నంటిన సంబరాలు

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికల్లో బరాక్‌ ఒబామా జయకేతనం ఎగరవేశారు. దీంతో అమెరికాలో డెమొక్రాట్ల సంబరాలు మిన్నంటాయి. డెమొక్రాట్‌ పార్టీ తరపున రెండోసారి ఒబామా గెలుపొందడంతో షికాగోలోని పార్టీ ప్రధాన కార్యాలయం ముందు పెద్దసంఖ్యలో చేరుకున్న అభిమానులు విజయోత్సవరంలో మునిగితేలారు.

అమెరికా ఎన్నికల్లో ఒబామా ఘనవిజయం

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడుగా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి బరాక్‌ ఒబామా తిరిగి ఎన్నికయ్యారు. దీంతో ఆయన మరో నాలుగేళ్లు శ్వేతసౌధంలో అధికారపీఠంపై కొనసాగుతారు. ఓట్ల లెక్కింపులో మొదట ప్రత్యర్థి మిట్‌ రోమ్నికంటే కొద్దిగా వెనుకబడినప్పటికీ, చివరలో పుంజుకొని…

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 28 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 11 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.