Friday, 13 November 2026

వార్తలు

వ్యవసాయ రంగం అభివృద్దికి రూ.15,000కోట్లు

హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయ రంగం, అనుబంధ, ఇతర రంగాల మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం ఆర్‌ఐడీఎఫ్‌ కింద నాబార్డ్‌ రూ.15వేల కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తుంది. దేశంలో మిగితా రాష్ట్రాల్లో ఆర్‌డీఎఫ్‌ వెచ్చించిన నిధులే అత్యధికమని ఆ సంస్థ…

ఎంబీఏ, ఎంసీయే ఫీజులు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌: ఎంబీఏ, ఎంసీఏ ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీఏ, ఎంసీఏ కనీస ఫీజు రూ.27 వేలుగా నిర్ణయించారు. గరిష్ఠంగా ఎంసీఏకు రూ.88వేలు, ఎంబీఏకు రూ.71వేలు నిర్ణయించారు.

హర్యానా ప్రభుత్వం, డీఎల్‌ఎఫ్‌ కుమ్మ్కయ్యాయి:కేజ్రీవాల్‌

ఢిల్లీ: హర్యానా ప్రభుత్వం, డీఎల్‌ఎఫ్‌ సంస్థలు కుమ్మక్కయ్యాయని అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. రాబార్ట్‌ వాద్రా అవినీతికి పాల్పడ్డారని రుజువు చేసే మరికొన్ని పత్రాలను ఈ రోజు సాయంత్రం కేజ్రీవాల్‌ బయటపెట్టారు. హర్యానా ప్రభుత్వం డీఎల్‌ఎఫ్‌ మధ్య సంబంధాన్ని హైకోర్టు…

మోపిదేవికి మరోసారి బెయిల్‌ నిరాకరణ

హైదరాబాద్‌: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు మరోసారి సీబీఐ కోర్టు బెయిల్‌ను నిరాకరించింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో మోపిదేవి, బ్రహ్మానందరెడ్డిల బెయిల్‌ పిటిషన్లను సీబీఐ న్యాయస్థానం కొట్టివేసింది.

మాయవతి, సీబీఐలకు సుఫ్రీంకోర్టు నోటీసులు

  ఢిల్లీ: మాయవతిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తీర్పును పున:సమీక్షి పిటిషన్‌పైమాయవతి, సీబీఐలకు సుఫ్రీంకోర్టు నోటీప్ణసులు జారీ చేసింది. తాము ఎవరిని రక్షించేందుకు యత్నించటంలేదని, మాయవతిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు చేసే స్వేచ్చ సీబీఐకి…

భౌతికశాస్త్రంలో నోబెల్‌ కూడా ఇద్దరికి

  స్వీడన్‌: భౌతికశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం కూడా ఈ ఏడాది ఇద్దరిని వరించింది. ఫ్రెంచి శాస్త్రవేత్త సెర్జి హరోచె, అమెరికన్‌ శాస్త్రవేత్త డేవిడ్‌ వైన్‌లాండ్‌లు భౌతిక శాస్త్ర నోబెల్‌ను సంయుక్తంగా గెలుపొందారు. క్వాంటామ్‌ పార్టీకిల్స్‌కు సంబంధించి ఇప్పటి వరకు…

చంచల్‌గూడ జైలు నుంచి శ్రీలక్ష్మి విడుదల

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో నిందితురాలైన శ్రీలక్ష్మీ ఈ రోజు సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఆమెకు వైద్య చికిత్స నిమిత్తం సీబీఐ న్యాయస్థానం నిన్న షరతులతో కూడిన తాత్కాలిక బెయిలు మంజూరు చేసిన విషయం విదితమే.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిందితుల విచారణ: రిమాండ్‌ పొడింగిపు

హైదరాబాద్‌: ఓఎంసీ, ఎమ్మార్‌. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో నిందితులను సీబీఐ న్యాయస్థానం ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది, జగన్‌, గాలి జనార్థన్‌రెడ్డి, మోపిదేవి, బీపీ ఆచార్య, బ్రహ్మానందరెడ్డిలకు ఈ నెల 25 వరకు రిమాండ్‌ పొడిగించింది.…

ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

హైదరాబాద్‌: కొందరు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేవాదాయశాఖ కమిషనర్‌ బలరామయ్య సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. విశాఖ గిరిజన కోపరేటివ్‌ కార్పొరేషన్‌ ఎండీ కేవీ రమణ స్థానంలో ఇ. రమేశ్‌…

విలీనం దిశగా వైకాపా ఓ మెట్టు ఎక్కింది: దాడి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో విలీనం  దిశగా వైకాపా ఒక మెట్టు ఎక్కిందని మండలిలో ప్రతిపక్షనేత దాడి వీరభద్రరావు అన్నారు. రాష్ట్రపతితో విజయమ్మ భేటీ అనంతరం జగన్‌ అధికారిక నివాసంపై ఉన్న పార్టీ జెండాను తీసేశారని ఆయన పేర్కొన్నారు. జగన్‌కు బెయిల్‌…