Friday, 13 November 2026

వార్తలు

బీఎస్పీ కార్యవర్గ సభ్యులతో మాయావతి సమావేశం రేపు

లక్నో: యూపీఏ ప్రభుత్వానికి మద్దతివ్వడంపై బీఎస్పీ కార్యవర్గ  సభ్యులతో మాయావతి రేపు భేటీ కానున్నారు. చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అనుమతి, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏకు మద్దతు అంశంపై వారు చర్చించనున్నారు. కాన్షీరామ్‌ వర్థంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో…

సాగరహారంలో 39 కేసులు నమోదు: అనురాగ్‌శర్మ

హైదరాబాద్‌: సాగరహారం కార్యక్రమం సందర్భంగా మొత్తం 39 కేసులు నమోదు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ తెలియజేశారు. ఈ కేసుల దర్యాప్తు సిట్‌ పర్యవేక్షణలో సాగుతోందని ఆయన తెలియజేశారు. వీడియోల ఆధారంగా సాక్ష్యాలు సేకరిస్తున్నామని కమిషనర్‌ చెప్పారు. పోలీసు…

థర్మల్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో కాకరాపల్లి ధర్మల్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మళ్లీ ఆందోళన తలెత్తింది. ఆందోళన చేపట్టిన సీతారాంపురం, కేసినాయుడుపేట గ్రామస్థులు నౌపాడ రహదారిపై వంటావార్పు, సామూహిక సహపంక్తి భోజనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌తో మంత్రి డీకే అరుణ భేటీ

న్యూఢిల్లీ:  రాష్ట్ర మంత్రి డీకే అరుణతో పాటు పలువురు మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలు ఆస్కార్‌  ఫెర్నాండెజ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఫెర్నాండెజ్‌ మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలు తెలంగాణ పై తమ అభిప్రాయాలు తెలిపారని అన్నారు. వారి…

‘తెలంగాణ మార్చ్‌’ కేసులపై హోంమంత్రి సమీక్ష

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ రాజకీయ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ తెలంగాణ మార్చ్‌’ సందర్భంగా నమోదైన కేసులపై హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇవాళ ఆమె హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మతో సమావేశమై ఈ కేసుల…

పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి భేటీ

హైదరాబాద్‌: పోలీస ఉన్నతాధికారులతో సచివాలయంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. సెప్టెంబర్‌ 30న నెక్లెస్‌ రోడ్డులో నిర్వహించిన తెలంగాణ కవాతు సందర్భంగా నమోదైన కేసులపై మంత్రి సమీక్షించారు.

‘తెలంగాణ ప్రాజెక్టులపై సీఎంది నవతితల్లి ప్రేమ’

కరీంనగర్‌: తెలంగాణ ప్రాజెక్టులపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని మాజీ ఎంపీ వినోద్‌కూమార్‌ అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను సీఎం కిరణ్‌ పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ హైడ్రాలజీ రిపోర్టును ఇవ్వలేదని, దాన్ని…

అసోంలో రెండు పడవలు మునిగి ఏడుగురి మృతి

గౌహతి: అసోం రాష్ట్రంలోని మోరిగావ్‌ వద్ద నదిలో రెండు పడవలు మునిగిపోయాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పలువురు  గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. మృతుల్లో ఐదుగురు పాఠశాల విద్యార్థులు ఉన్నారు.…

ముగ్గురు నకీలీ నక్సల్స్‌ అరెస్టు

హైదరాబాద్‌: అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు నకిలీ నక్సల్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ముగ్గురు ఎస్‌. ఆర్‌. నగర్‌లో నివసించే చంద్రశేఖర్‌ అనే ఓబిల్డర్‌కు కొండపల్లి సీతారామయ్య పేరుతో లేఖరాసి రూ. 15 లక్షలు డిమాండ్‌ వ్యక్తం…

హెచ్‌ఐసీసీ ప్రాంగణం వద్ద ఎగ్గిబిషన్‌ సిబ్బంది ఆందోళన

హైదరాబాద్‌: అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు జరుగుతున్న హెచ్‌ఐసీసీ ప్రాంగణం వద్ద హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సిబ్బంది. ఆందోళనకు దిగారు. హైటెక్స్‌ ఎండీని హెచ్‌ఐసీసీ ప్రాంగణంలోకి అనుమంతించలేదని స్టాళ్లకు తాళాలు వేసి సిబ్బంది. నిరసన చేపట్టారు.