Friday, 13 November 2026

వార్తలు

తమిళనాడుకు కావేరీ నుంచి నీటి విడుదల నిలిపేస్తాం: కర్ణాటక సీఎం

ఢిల్లీ: ఈరోజు అర్ధరాత్రి నుంచి తమిళనాడుకు కావేరీ నుంచి నీటి విడుదలను నిలిపి వేస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌ ప్రకటించారు. సెప్టెంబరు 19న కావేరీ రివర్‌ అథారిటీ నిర్ణయం మేరకు సెప్టెంబరు 20 నుంచి అక్టోబరు 15…

శ్రీలక్ష్మీకి బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మీకి సీబీఐ న్యాయస్థానం తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. వెన్నముక చికిత్స కోసం ఆమెకు బెయిల్‌ ఇస్తున్నట్లు పేర్కొన్న న్యాయస్థానం తిరిగి జనవరి 21న లొంగిపోవాలని ఆదేశించింది. తాత్కాలిక బెయిల్‌కోసం రూ. 15 వేలు…

భారీగా నష్టాపోయిన డీఎల్‌ఎఫ్‌ షేరు

ముంబయి: రాబర్ట్‌ వాద్రా, డీఎల్‌ఎఫ్‌ అక్రమ లావాదేవలు జరిగాయన్న విషయాన్ని అరవింద్‌ కేజ్రివాల్‌ బృందం బయట పెట్టడంతో ఈరోజు మార్కెట్టో డీఎల్‌ఎఫ్‌ షేరు బాగా పడిపోయింది. గత ఏడు నెలల్లో ఈ షేరు ఇంతగా పడిపోవడం ఇదే మొదటిసారి.…

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో విజయమ్మ సంభాషణలు

అనంతపురం: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో వైకాపా గౌరవాధ్యక్షురాలు వై.ఎస్‌ విజయమ్మ జరిపిన సంభాషణల గుట్టు రట్టు చేయాలని తెదేపా నేత పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రపలతి ఎన్నికల్లో ఓటు వేసినందుకు ప్రతిఫలంగా ఏమిస్తారో తెలుసుకునేందుకే ఆమె ప్రణబ్‌ను…

యువకుడి ఆత్మహత్యాయత్నం

విశాఖపట్నం: విశాఖపట్నంలోని మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌లో శ్రీనివాస్‌ అనే యువకుడు గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. చోరీ కేసులో విచారిస్తుండగా అతనీపనికి పాల్పడడంతో పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఇండోనేషియాలో భూకంపం

జకార్తా: ఇండోనేషియాలో ఈ రోజు భూకంపం సంభవించినట్లు అమెరికాకు చెందిన జియోలాజికల్‌ సర్వే కార్యాలయం తెలిపింది. రిక్టర్‌ స్కేలుపై 6.3 తీవ్రత నమోదైన ఈ భూకంపం అంబస్‌ నగరానికి 140 కి.మీ దూరంలో సంభవించినట్లు తెలుస్తోంది. భూకంపం తాలూకు…

స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌ ధర

ఢిల్లీ: పెట్రోల్‌ ధర స్వల్పంగా తగ్గింది. లీటరుకు 56 పైసలు తగ్గింది. తగ్గిన ధర ఈ రోజు అర్థరాత్రినుంచి అమలులోకి వస్తుంది.

అక్కినేని అమల అరెస్ట్‌

హైదరాబాద్‌: ప్రముఖ నటి, బ్లూక్రాస్‌ అధ్యక్షురాలు అక్కినేని అమలను ఈరోజు చార్మనార్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. చార్మినార్‌పై పర్యావరణ పరిరక్షణ బ్యానర్‌ను కట్టినందుకు ఆమెను, గ్రీన్‌ పీస్‌ కార్యకర్తలను సెక్షన్‌ 151 కింద కేసు నమోదు చేసి అరెస్టు…

రూ.40 లక్షలతో బంగారం వ్యాపారి పరారీ

ముమ్మిడివరం: తూగోజిల్లా ముమ్మిడి వరంలో బంగారం వ్యాపారి దుర్గాప్రసాద్‌ నగల పేరుతో కొనుగోలుదారుల నుంచి రూ. 40 లక్షల మేర వసూలు చేసి పరారయ్యాడు.

ఆటో, జీపు ఢీ: ఇద్దరి మృతి

హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలోని రాళ్లగూడ వద్ద ఆటోను టాటా సఫారీ ఢీ కొంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.