Friday, 13 November 2026

వార్తలు

వికలాంగులను మోసం చేస్తోన్న ప్రభుత్వం

శ్రీకాకుళం: జిల్లాలో సదరం పేరుతో వికలాంగులను మోసం చేస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు ఆరోపించారు 80 శాతం అంగవైకల్యంతో కంటికి కనబడుతున్న వికలాంగులను పింఛన్లకు దూరం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు కంటికి కనబడుతున్న అంగవైకల్యాన్ని చూసిన వెంటనే…

పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేయలేదు: సీఎస్‌

హైదరాబాద్‌: సాగరహారంలో భాగంగా ఉద్యోగులపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ స్పష్టం చేశారు. ఈ రోజు తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు ఆమెతో సమావేశమయ్యారు. తెలంగాణ కవాతులో భాగంగా ఉద్యోగులపై…

సమీక్షపై విచారణ

ఢిల్లీ : కావేరీ వివాదం పై కర్ణాటక వేసిన పున సమీక్ష పిటిషస్‌ పై విచారణను సుప్రీంకోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది

ఎమ్మెల్యే హరీష్‌ రావు అకస్మిక తనిఖీ

  సిద్దిపేట : పట్టణంలోని మాతా శిశు అరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే హరీశ్‌ రావు అకస్మిక తనిఖీ చేశారు. స్కానింగ్‌ బయట చేయించుకోమనడం , మందులకోసం చీటీలు రాయడంపై అయన వైద్యసిబ్బందిపై అగ్రహం వ్యకతం చేశారు.

విశాలాంధ్ర సభల పేరుతో విద్వేషాలు రేపొద్దు: వినోద్‌

హైదరాబాద్‌: తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తమ పార్టీ కోరుకోవడం లేదని తెరాస సీనియర్‌ నేత వినోద్‌ చెప్పారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలంగాణ పట్ల సానుకూలంగా ఉందని తుది నిర్ణయమే తీసుకోవాల్సి ఉందన్నారు.  హైదరాబాద్‌ను కాంగ్రెస్‌ ఒక…

సీఎస్‌తో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ భేటీ

హైదరాబాద్‌: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మేథ్యూతో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ మార్చ్‌లో నమోదైన కేసుల గురించి ఈ సమావేశంలో నేతలు చర్చించారు.

ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్‌ నేతల పయనం

హైదరాబాద్‌: సాగరహారం నేపథ్యంలో తమపై వస్తున్న ఒత్తిడిని తట్టుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్ఠానాన్ని కలిసి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు  ఒత్తిడి తీసుకురావాలని నేతలు భావిస్తున్నారు. మంత్రి డీ కె. అరుణ మాట్లాడుతూ ఈ మధ్యాహ్నం…

వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు రానున్న సైన్స్‌ ఎక్స్‌ప్రేస్‌

వరంగల్‌:   జీవవైవిద్య ప్రత్యేకతలను వివరిస్తూ వాతవారణ మార్పులను దానికి కారణాలను విశ్లేషిస్తూ వరంగల్‌ విద్యార్థులకు విజ్ఞాన్ని పంచిన సైన్స్‌ఎక్స్‌ ప్రెస్‌ నేడు హైదరామాద్‌కు వెళ్లనుంది. గత 4రోజులుగా వరంగల్‌ రైల్వే డివిజన్‌లోని కాజీపేట్‌ స్టేషన్‌లో ఉన్న సైన్స్‌ఎక్స్‌ప్రెస్‌ నేడు…

భూకేటాయింపుల బిల్లుపై మంత్రుల కమిటీ భేటీ

ఢిల్లీ: భూకేటాయింపుల బిల్లుపై చర్చించడానికి ఈ రోజు కేంద్ర మంత్రుల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు శరద్‌పవార్‌, జైరాంరమేష్‌, కిషోర్‌ చంద్రదేవ్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, సీపీ జోషీ హాజరయ్యారు. మంత్రుల కమిటీ ఈ భేటీలో భూకేటాయింపులపై విధాన…

నెల్లూరులో కాంగ్రెస్‌ పార్టీ మాజీ కార్పోరేటర్‌ అరెస్ట్‌

నెల్లూరు:  నెల్లూరుకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ మాజి కార్పోరేటర్‌ సంక్రాంతి కళ్యాణ్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మనీ స్కీమ్‌ వ్యవహారంలో కళ్యాణ్‌ రూ.60లక్షలు స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి