Friday, 13 November 2026

వార్తలు

9నుంచి ఆరోగ్యశ్రీ వైద్య శిబిరాలు

కర్నూలు (వైద్యాలయం) జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు మేరకు ఈ నెల 9నుంచి ఆరోగ్యశ్రీఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయకర్త డాక్టర్‌టి.పుల్లన్నతెలిపారు ఈనెల9న బేతంచెర్ల 16 న కోసిగి,30న కొలిమిగుండ్లలో శిబిరాలు జరుగుతాయన్నారు రోగులు,బాదితులు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని…

‘ మార్చ్‌’పై ఢిల్లీలో చర్చ: అజిత్‌ సింగ్‌

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌పై ఢిల్లీలో కూడా చర్చ జరిగిందని కేంద్ర మంత్రి అజిత్‌ సింగ్‌ పేర్కొన్నారు. తెలంగాణవాదులంతా ఏకతాటిపై ఉన్నారని ఆయన తెలియజేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశం 20-30 ఏళ్లుగా కొనసాగుతోందని ఆయన చెప్పారు.

లగడపాటి ఓపిచ్చోడు: పాల్వాయి

హైదరాబాద్‌: సీమాంధ్ర ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఓ పిచ్చోడు అని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. లగడపాటి ఓ జోకర్‌ అని అధిష్టాన పెద్దలే చాలాసార్లు అన్నారని తెలియజేశారు. లగడపాటి మాటలను తెలంగాణ ప్రజలు ఎవరూ నమ్మవద్దని…

తెలంగాణ కోసం పోరాడుతాం: కేకే

హైదరాబాద్‌: అన్ని పార్టీలను కలుపుకుని తెలంగాణ సాధన కోసం పోరాడుతామని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత.కె.కేశవరావు తెలియజేశారు. ఇప్పటికే టీడీపీ ఎంపీలతో చర్చించామని చెప్పారు. తెలంగాణ పోరాటానికి, ఎంపీలకు కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ చేయూతనిచ్చారని పేర్కొన్నారు.

ఉత్సాహంగా సాగిన పింక్‌ రిబ్బన్‌ వాక్‌

హైదరాబాద్‌: రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కోసం ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌, హైదరాబాద్‌ ఆమెరికా కాన్సులేట్‌ జనరల్‌  సంయుక్త అధ్వర్యంలో పింక్‌ రిబ్బన్‌ వాక్‌ నిర్వహించారు. కేబీఆర్‌ పార్క్‌ నుంచి ప్రారంభమైన ఈ నడకలో పలువురు. సినీ, క్రీడా…

కేసీఆర్‌తో ఎలాంటి విభేదాల్లేవు: కోదండరాం

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో ఎలాంటి విభేదాల్లేవు అని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. మీడియాతో పాటు ఇతరులు అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. అందరం కలిసి తెలంగాణ సాధనం కృషి చేస్తామని పేర్కొన్నారు.

టీ-20 ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడే

కొలంబో: శ్రీలంక-  వెస్టిండీస్‌ జట్ల మధ్య టీ 20 ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడు కొలంబోలో జరగనుంది. సొంత గడ్డపై కప్పు గెలవాలని లంక వ్యూహాలు రచిస్తుండగా.. పూర్వ వైభవాన్ని చాటాలని విండీస్‌ ఉవ్విళ్లూరుతోంది. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్‌…

మధుయాస్కీ నివాసంలో నేతలకు అల్పాహార విందు

హైదరాబాద్‌: ఎంపీ మధుయాస్కీ తన నివాసంలో పలువురి నేతలకు ఈ ఉదయం అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందుకు కేంద్ర మంత్రి అజిత్‌ సింగ్‌, ఎంపీలు మందా జగన్నాధం, గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజయ్య, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, అసదుదీందన్‌ ఓవైసీలతోపాటు…

ఆర్థికపరిస్థితి సవాల్‌గానే వుంది: చిదంబరం

ముంబయి: దేశంలో ఆర్థికరంగంపరిస్థితి ఇంకా సవాల్‌గానే వుందని కేంద్ర  ఆర్థికమంత్రి చిదంబరం అన్నారు. పెట్టుబడులను ప్రోత్సాహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని ఆయన పేర్కొన్నారు. నిఫ్టీ సూచీ కుప్పకూలడంపై ఎస్‌ఎస్‌ఈ దర్యాప్తు జరువుతోందని ఆయన వెల్లడించారు. బీమా, పింఛను రంగాలకు…

తులసీరెడ్డి పదవికాలం పొడిగింపు

హైదరాబాద్‌: 20 సూత్రాల పథకం అమలు కమిటీ ఛైర్మన్‌ తులసీరెడ్డి పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగించారు. ఆయన పదవీకాలాన్ని రెండేళ్లు పొడిగించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించారు.