Tuesday, 10 November 2026

వార్తలు

2010 ఐఏఎస్‌ ప్రొబేషనర్లకు సబ్‌ కలెక్టర్లుగా పోస్టింగులు

హైదరాబాద్‌: 2010 సంవత్సరపు ఐఏఎస్‌ ప్రొబేషనర్లు ఏడుగురికి ప్రభుత్వం సబ్‌ కలెక్టర్లుగా పోస్టింగులు ఇచ్చింది. భద్రాచలం సబ్‌ కలెక్టరుగా నారాయణ భరత్‌ గుప్తా, భువనగిరి సబ్‌ కలెక్టరుగా డి. దివ్వ, వికారాబాద్‌ సబ్‌ కలెక్టరుగా ఆమ్రపాలి కాటా, గూడూరు…

సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని టొబాకోబజార్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బజార్‌లోని మోహన్‌ టెక్స్‌టైల్స్‌లో మంటలు  ఎగిసిపడుతున్నాయి. భయంతో జనాలు పరుగులు తీశారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నట్లు సమాచారం.

బీజేపీ బంద్‌ సంపూర్ణం

కరీంనగర్‌: నగరంలో బీజేపీ పిలుపునిచ్చిన బంద్‌ విజయవంతమైంది. నగరంలో వ్యాపార వర్గాలు సంపూర్ణ బంద్‌ పాటించారు. బ్యాంక్‌లు, వాణిజ్య సంస్థలు, బంద్‌ పాటించాయి. నగర అధ్యక్షుడు బండి సంజయ్‌ అనుచరులు కొంత మంది కోర్టు అవరణలో ఉండటం చేత…

రోడ్డు ప్రమాదంలో సుప్రీంకోర్టు అడిషనల్‌ రిజష్ట్రార్‌ నర్సింహరాజు కుమారుడు మృతి

ఖమ్మం: జిల్లాలోని వైరా పట్టణంలో జరిగిన రోడ్డుప్రమాదంలో సుప్రీంకోర్టు అడిషనల్‌ రిజిష్ట్రార్‌ నర్సంహరాజు కుమారుడు రాంచందర్‌ రాజు మృతి చెందారు. మృతుడు 7 నెలలక్రితం వైరాలోని నాగార్జున గ్రామీణ బ్యాంకుకు ఫీల్డ్‌ ఆఫీసర్‌గా వచ్చారు. గత రాత్రి ఖమ్మం…

రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి

ఖమ్మం : జిల్లాలోని వైరా బ్యాంక్‌లో పనిచేస్తున్న ఎన్‌.రామచంద్రం(25) రోడ్డు ప్రమాదంలో మరణించాడు. గుంటూరు జిల్లా మాచర్లలోని పాల్వాయి గ్రామం స్వగ్రామం. తండ్రి సుఫ్రీంకోర్టులో అడిషనల్‌ రిజిష్టరుగా పనిచేస్తున్నారు.

గోదావరిఖనిలో కాంట్రాక్టు కార్మికుడి ఆత్మహత్యాయత్నం

గోదావరిఖని: కరీంనగర్‌ జిల్లా గోదావరి ఖనిలో కాంట్రాక్టు కార్మికుడు హరీష్‌ ఈ రోజు మధ్యాహ్నం ఎన్టీపీసీ సర్వీస్‌ భవనం పైకి  ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. అధికారులు వాహనాన్ని పంపారు. హరీష్‌ కుటుంబసభ్యులను అక్కడికి రప్పించేందుకు అధికారులు వాహనాన్ని…

ఫీజు రుసుం పిటీషన్‌పై విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: ఫీజు రుసుంపై సింగిల్‌ బెంచి ఉత్తర్వులను సవాలుచేస్తూ దాఖలైన ప్రభుత్వ పిటీషన్‌పై విచారణ రేపటికి వాయిదాపడింది. అఫిడవిట్లు ఇవ్వలని కళాశాలలకు రూ.50,200 ఫీజు నిర్ణయాన్ని సవాలుచేస్తూ హైకోర్టులో ప్రభుత్వం పిటీషన్‌ వేసింది. ఇలా ఉండగా ప్రభుత్వ ఫీజు…

యశ్వంత్‌పూర్‌-విజయవాడ రైలింజన్లో మంటలు

యశ్వంత్‌పూర్‌-విజయవాడ ప్యాసెంజర్‌ రైలులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చేగిచర్ల రైల్వే స్టేషన్‌ సమీపంకు రైలు చేరుకోగానే రైలు ఇంజిన్‌ నుంచి మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ రైలును ఆపగానే ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు…

పార్లమెంట్‌ ఉభయసభలు రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: బొగ్గు కేటాయింపులతో అట్టుడికిన పార్లమెంట్‌ రేపటికి వాయిదాపడింది. మథ్యాహ్నం రెండుగంటల వరకు వాయిదాపడిన లోక్‌ సభ రెండుగంటలకు మళ్లీ సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కాగ్‌ నివేదిక ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని ఆధారాలు లేకుండా…

కోతలపై డిస్కింల వద్ద ధర్నాకు తెదేపా నిర్ణయం

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యలపై తెదేపా శాసనసభా పక్ష భేటీ ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో ముగిసింది. మధ్యాహ్నాం 3 గంటలకు మరోసారి సమావేశం కావాలని నేతలు నిర్ణయించారు. విద్యుత్‌ కోతలపై డిస్కింల వద్ద ధర్నా చేయాలని నేతలు ఈ భేటీలో నిర్ణయించారు. …