Monday, 9 November 2026

వార్తలు

ఒలింపిక్స్‌ సంబురాలు పరిసమాప్తం

వీడ్కోలు వేడుకకు సర్వం సిద్ధం పతకాల పట్టికలో అగ్ర భాగాన అమెరికా లండన్‌, ఆగస్టు 12 (జనంసాక్షి) : లండన్‌ ఒలింపిక్స్‌కు అథ్లెట్లు వీడ్కోలు పలకనున్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ముగింపు…

రెజ్లింగ్‌లో రజితం

 లండన్‌లో మళ్లీ రెపరెపలాడిన త్రివర్ణం చరిత్ర సృష్టించిన సుశీల్‌ కుమార్‌ భారత్‌ ఖాతాలో ఆరో పతకం లండన్‌, ఆగస్టు 12 (జనంసాక్షి) : లండన్‌ ఒలింపిక్స్‌లో ఆఖరిరోజు రెజ్లర్‌ సుశీల్‌కుమార్‌ సంచలనం సృష్టించాడు. సెమీస్‌లో నెగ్గి ఫైనల్‌కు చేరుకు…

ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్‌

‘స్వాతంత్య్ర’ వేడుకలకు ముందు హైజాక్‌ ! అల్లర్లు సృష్టించేందుకు ‘లష్కరే’ కుట్ర నిఘా వర్గాల అనుమానాలు.. న్యూఢిల్లీ, ఆగస్టు 12 (జనంసాక్షి): దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో భారత ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. అంతే గాక ఆదివారం నుంచి తనిఖీలు…

శాంతి దూతగా ఇక ఉండను

రాజీనామాకు కోఫీ అన్నన్‌ నిర్ణయం భద్రతామండలి సహకరించలేదని వెల్లడి సిరియా దౌత్యానికి ఎదురుదెబ్బ న్యూఢిల్లీ , ఆగస్టు 12 (జనంసాక్షి): ఐక్యరాజ్యసమితి శాంతి ధూత డాక్టర్‌ కోఫీ అన్నన్‌ రాజీనామా తో సిరియా శాంతి దౌత్యానికి గట్టి ఎదురుదెబ్బ…

పోలీసుల అదుపులో మావోయిస్టు నేత

విశాఖ: మావోయిస్టు నేత సూర్యంను పోలిసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఒరిస్సాలోని మల్కాన్‌గిరి జిల్లాలో సూర్యంను పోలిసులు అదుపులోకి తీసుకొని రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలిసినప్పటకీ పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించడంలేదు. ఏవోబీలో మావోయిస్టు కార్యకలాపాల్లో సూర్యం…

రాందేవ్‌ దీక్షకు టీడీపీ మద్దతు

ఢిల్లీ: రాంలీల మైదానంలో రాందేవ్‌ బాబా చేపట్టిన దీక్షకు తెలుగు దేశం మద్దతు తెలియజేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పార్టీ ఎంపీలు కొన్నకల్ల నారాయణ, సీఎం రమేష్‌లు రాందేవ్‌బాబాను కలిసి మద్దతు తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా…

సాంకేతిక పరిజ్ఞానం వల్ల చాలా ఉపాయోగాలు : జేపీ

హైదరాబాద్‌: సాంకేతిక పరిజ్ఞానం నేపధ్యాన్ని మర్చిపోకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని లోక్‌సత్తా శ్రేణులకు అధినేత జయప్రకాష్‌ నారాయణ సూచించారు.హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ లోని లోక్‌సత్తా కేంద్ర కార్యాలయంలో ఆయన పార్టీ ఆన్‌లైన్‌ సభ్యత్వనమోదు కార్యక్రమాని తొలిసారిగా ప్రారంభించారు. వివిధ జిల్లాల…

సుశీల్‌కుమార్‌కు ప్రధాని అభినందనలు

న్యూఢిల్లీ: లండన్‌ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ 66కిలోల ఫ్రీస్టైల్‌ విభాగంలో రజతం సాధించిన భారత రెజ్లర్‌ సుశీల్‌కుమార్‌కు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అభినందనలు తెలిపారు. రెజ్లింగ్‌ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన సుశీల్‌కుమార్‌ జాతి గర్వించదగ్గ వ్యక్తి అని ప్రధాని ఒక…

ఒలంపిక్స్‌లో భారత్‌కు ఆరో పతకం

లండన్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో భారత్‌ మరో పతకం సాధించింది. రెజ్లింగ్‌లో 66 కిలోల ఫ్రీస్టైల్‌ విభాగంలో సుశీల్‌కుమార్‌ రజతం సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో జసాన్‌కు చెందిన యెనిమిత్సు చేతిలో 1-3 తేడాతో పరాజయం పాలై కొద్దిలో స్వర్ణాన్ని…

ముత్యాలమ్మపాలెంలో టీడీపీ వైకాపా మధ్య ఘర్షన

విశాఖపట్నం: జిల్లాలోని పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో ఎన్టీపీసీ ఉద్యోగాల విషయంలో తేదేపా వైకాపా ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయినావి, పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు.