Monday, 9 November 2026

వార్తలు

సుపరిపాలనపై లోక్‌సత్తా రౌండ్‌ టేబుల్‌ సమావేశం

హైదరాబాద్‌: సుపరిపాలన, సురాజ్య సాధన దిశగా అన్ని పార్టీలను ఏకం చేసేందుకు లోక్‌సత్తా సిద్ధమైంది. దీనిలో భాగంగా సుపరిపాలనకు అవరోధంగా మారిన పలు అంశాలపై చర్చంచేందుకు ఇవాళ హైదరాబాద్‌లో ఓ రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌…

అవినీతికి వరదగేట్లు తెరిచిన ప్రభుత్వం: బాబు

తెనాలి: అవినీతికి వరద గేట్లు తెరవడం వల్లే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టు కోలేకపోతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌పై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెనాలిలోని వీఎస్‌ఆర్‌ కళాశాల విద్యార్థులు చేపట్టిన రాస్తారోకోలో ఆయన…

సచివాలయ ముట్టడి భగ్నం

హైదరాబాద్‌: రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతు సంఘం  నాయకులు చేపట్టిన సచివాలయ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్దకు చేరుకోగానే రైతు సంఘం నేత రామకృష్ణ సహా ఆందోళనకారులందరికీ పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు…

కోర్టులో నాటు బాంబులు స్వాధీనం

లక్నో: లక్నో జిల్లా కోర్టులో ఈ రోజు పోలీసులు నాలుగు నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న న్యాయవాదులు, కోర్టు  సిబ్బంది విధులను బహిష్కరించి కోర్టు భవనం నుంచి బయటకు పరుగులు తీశారు. పోలీసులు కోర్టు భవనంలో…

ఇస్కాన్‌కు భూముల లీజుపై రగడ

హైదరాబాద్‌: ఇస్కాన్‌ సంస్థకు జూబ్లీహిల్స్‌లోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భూములను లీజుకు ఇవ్వడాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మంత్రి దానం నాగేందర్‌ అక్కడకు చేరుకుని ఆలయ గేటుకు తాళం వేశారు. దీంతో ఆలయం వద్ద ఉద్రిక్త…

జగన్‌ పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ: తన అరెస్టు అక్రమం అంటూ వైఎస్‌ జగన్‌ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బెయిల్‌ పిటిషన్‌లోనే అరెస్టు అంశంపై వాదనలు వింటామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో ఈ రోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,150గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29, 550గా ఉంది.…

సీఎం క్యాంప్‌ ఆఫిస్‌ను ముట్టడించిన టిఆర్‌ఎస్‌వీ

హైదరాబాద్‌: ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పై ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో విద్యార్థులు సీఎం క్యాంప్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ ముట్టడిలో పోలీసులకు విద్యార్థులకు మద్యతోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి బేగంపేట…

పాలమూరు జిల్లా మనుగూరు మండలంలో చోరీ

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మనుగూరు మండలం చేగుంటలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. 24 తులాల బంగారం, 50 వేల రూపాయల నగదు దొంగతనానికి గురైనట్లు బాధితులు తెలియజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తుకున్న పోలీసులు…

వ్యక్తి దారుణహత్య

గుంటూరు: మంగళగిరి మండలం నూతక్కి వద్ద ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు.మృతుడు డోడవర్రూ ఇసుక రీచ్‌లో క్యాషియర్‌గా పోలీసులు గుర్తించారు. ఇసుక రీచ్‌కు చెందిన రూ. 13 లక్షల నగదును తీసుకెళ్తుండగా అతడిని దుండగులు హత్య చేసి మృతదేహాన్ని…