Sunday, 8 November 2026

వార్తలు

పెట్రోల్‌ ధర మరో 70పైసలు పెరిగింది!

న్యూఢిల్లీ, జూలై 23: మరోమారు పెట్రోల్‌ ధర పెరిగింది. లీటరుకు 70 పైసల వంతున పెంచుతూ చమురు సంస్థలు, కేంద్రం సోమవారంనాడు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపు సోమవారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నట్టు పేర్కొన్నాయి.

ప్రణబ్‌ను కలిసిన పవార్‌

న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్‌ ముఖర్జీకి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అభినందనలు తెలిపారు. సోమవారమిక్కడ ప్రణబ్‌ నివాసంలో పవార్‌ నేతృత్వంలో ఎన్‌సీపీ నాయకులు ఆయన్ను కలిశారు. వీరిలో ప్రఫుల్‌ పటెల్‌, తారిఖ్‌ అన్వర్‌, డీపీ…

నిర్మాణంలో ఉన్న పోలీస్‌ అవాసాలపై మావోయిస్టుల దాడి

గిరిధిహ్‌: నిర్మాణంలో ఉన్న పోలీసు క్వార్టర్లపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. జార్ఖండ్‌లోని గిరిధిహ్‌ పట్టణ శివార్లలో ఈఘటన చోటుచేసుకుంది. సోమవారం వేకువ జామునే దాడి చేసిన మావోయిస్టులు పలు భవంతులను ధ్వంసం చేయడంతో పాటు ఇద్దరు కూలీలను పొట్టనబెట్టుకున్నారు. మావోయిస్టులు…

అప్జల్‌ గురు క్షమాబిక్ష దరఖాస్తును తిరస్కరించండి

-ప్రణబ్‌ను కోరిన బాల్‌ థాకరే ముంబాయి: పార్లమెంట్‌పై దాడి కేసులో మరణశిక్ష పడిన అప్జల్‌గురు క్షమాబిక్ష పిటిషన్‌ను నిర్వ్దందంగా తిరస్కరించాలని.. కొత్త రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్‌ ముఖర్జీని శివసేన డిమాండ్‌ చేసింది. ఈ చర్యతోనే ప్రణబ్‌ రాష్ట్రపతిగా తన…

పోలవరం టెండరు ఇంకా ఖరారు కాలేదు

హైదరాబాద్‌ం పోలవరం ప్రాజక్టు టెండరు ఇంకా ఖరారు కాలేదని, అన్ని ఆంశాలను పరిశీలించాకే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని భారీ నీటిపారుదల శాఖమంత్రి సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. నిబంధనలు పాటించలేదని తేలితే ఈసోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం…

4లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు: సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్‌: ఈ ఖరీఫ్‌లో సుమారు 4లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు నీరందిస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రాప్రాంతంలో 69,500ఎకరాలు, రాయలసీమకు 72,305 ఎకరాలు, తెలంగాణ ప్రాంతంలో 2.46లక్షల ఎకరాలకు ఆగస్టు నాటికి సాగునీరు ఇవ్వనున్నట్లు…

శ్రవణ్‌గుప్తాపై అరెస్టు వారంట్‌ తాత్కాలికంగా నిలిపివేత

హైదరాబాద్‌: ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ శ్రవణ్‌గుప్తాపై నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ను సీబీఐ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఎమ్మార్‌ కేసులో 15వ నిందితుడిగా ఉన్న శ్రవణ్‌గుప్తాపై గతంలో సీబీఐ కోర్టు వారంట్‌ జారీ చేసింది. వారంట్‌ను వచ్చే నెల 23వ…

విజయమ్మ దీక్షపై స్పదించాల్సిన అవసరం లేదు

హైదరాబాద్‌: రాజకీయ దురుద్దేశంతో వైఎస్‌ విజయమ్మ చేపట్టిన దీక్షకు స్పందించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని చేనేతశాఖ మంత్రి ప్రసాద్‌కుమార్‌ అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2008-09 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో 312 కోట్ల…

పెట్రోల్‌ ధర పెంపు

న్యూఢీల్లీ: పెట్రోలు ధరను మరోసారి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటర్‌ పెట్రోలుకు 70 పైసలు పెంచారు. పెరిగిన ధర ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది.

వైఎస్‌ నర్లక్ష్యమే నేతన్నల ఆత్మహత్యకు కారణం: తెరాస

హైదరాబాద్‌: సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నర్గక్ష్యమనేనని తెరాస ఎమ్మోల్యే విమర్శించారు. ఆయన బతికి ఉన్నత కాలం రుణమాఫీ ఉత్తర్వులను అమలు చేయలేకపోయారని పార్టీ నేతలు మండిపడ్డారు. వైకాపాతో ప్రభుత్వం కుమ్మకై తెలంగాణ భవన్‌పై…