Sunday, 8 November 2026

వార్తలు

డా.రెడ్డీన్‌ మొదటి త్రైమాసిక ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: ఔషదరంగ సంస్థ డాక్టర్‌ రెడ్డీన్‌ 2012-13ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదలచేసింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆశాజనక ఫలితాలు సాధించినట్టు కంపెనీ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 28శాతం వృద్ధి సాధించినట్టు కంపెనీ ఒక ప్రకటనలో…

ఆటా సభలకెళ్లినందున ఓటు వేయలేకపోయా

వాషింగ్టన్‌: అమెరికాలో జరిగిన ఆటా సభలకు హాజరైనందున రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనలేక పోయానని బీజేపీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తాను రావాల్సిన విమానం రద్దు కావడంతో ఓటు హక్కును వినియోగించుకోలేకపోయానని వివరణ ఇచ్చారు.

ఆన్‌లైన్‌ చీటింగ్‌ కేసులో ఎండీ రమేష్‌ అరెస్టు

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న సిటీ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ఎండీ రమేష్‌రెడ్డిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. రూ.100కోట్లకు పైగా ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడినట్లు రమేష్‌రెడ్డిపై ఆరోపణలున్నాయి. రమేష్‌రెడ్డి నుంచి విలువైన పత్రాలు, భారీ మొత్తంలో నగదును స్వాధీనం…

ఎస్సీ,ఎస్సీ సబ్‌ప్లాన్‌ పై 23,24న అఖిలపక్ష భేటీ

హైదరాబాద్‌: ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌పై అభిప్రాయాలను సేకరించేందుకు జూబ్లీహాల్‌లో కేబినేట్‌ సబ్‌ కమిటీ భేటీ అయింది. భేటీ ముగిసిన అనంతరం డిప్యూటీ సీఎం దామోదర నర్సింహ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ పై 23,24 తేదీల్లో అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామని…

మందుబాబుల వీరంగం

నల్లగొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట మందుబాబులు వీరంగం సృష్టించారు. మందుబాబుల వీరంగాన్ని అడ్డుకోబోయిన హోంగార్డు పై వారు రాళ్లు విసిరారు. రాళ్లు విసరడంతో హోంగార్డుకి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హోంగార్డును ఆస్పత్రికి తరలించారు. మందుబాబులను…

21న టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు

హైదరాబాద్‌: ఈ నెల 21 న టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు ఫలితాలను మంత్రి పార్థసారధి విడుదల చేయనున్నట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు తెలిపింది.

మరో 24 గంటల్లో మోస్తరు వర్షాలు

విశాఖ: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలంగా మారాయని విశాఖ తుఫానుల హెచ్చరిక కేంద్రం తెలిపింది. మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్ర…

కాంగ్రెస్‌ వైకాపా నాణానికి బొమ్మబోరుసులు:బీజేపీ

హైదరాబాద్‌: కాంగ్రెస్‌, వైకాపా నాణానికి బొమ్మబొరుసులని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆ రెండు పార్టీలు ఒకటేనని గ్రూపు తగాదాలతో విడిపోయారని ఆయన అన్నారు. అందుకే రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌కి ఓటు వేశారని ఆయన అన్నారు. తెలుగుదేశంపార్టీ…

ప్రశాంతంగా ముగిసిన రాష్ట్రపతి పోలింగ్‌

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రంలో 190 మంది శాసన సభ్యులు, ముగ్గురు ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం పదిగంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఐదువరకు…

రామకోటయ్యపై పార్టీలో చర్చించి చర్చలు: వర్ల

హైదరాబాద్‌: పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్న చెన్నం రామకోటయ్యపై పార్టీలో చర్చించి, చర్యలు తీసుకుంటామని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. ఆయనతో పాటు బాలనాగిరెడ్డి, హరీశ్వర్‌రెడ్డి వంటి మరికొందరు నేతలు కూడా కేవలం సాంకేతికంగానే…