Saturday, 7 November 2026

వార్తలు

డైట్‌ సెట్‌కు 3 లక్షలకు పైగా అభ్యర్థులు

హైదారాబాద్‌: రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే డైట్‌ సెట్‌ ఆదివారం జరగనుంది. ఉదయం పదిన్నరనుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు డైట్‌ సెట్‌ జరుగుతుంది. పరీక్షకోసం రాష్ట్రవ్యాప్తంగా 1359 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కన్వీనరు ఆర్‌. సురేంద్రరెడ్డి తెలిపారు.…

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ పోటీ

నూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తరుపున అభ్యర్థిని బరిలో నిలపాలని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి. భాజపా అధ్యక్షుడు నితిన్‌గడ్కరీ నివాసంలో ఆపార్టీ అగ్రనేతలు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఎన్డీఏ అభ్యద్థిగా భాజపా సీనియర్‌ నేత…

పూరీ-యశ్వంత్‌పూర్‌ల మధ్య వీక్లీ గరీబ్‌ రథ్‌

హైదరాబాద్‌: ఈ నెల 20 నుంచి పూరీ-యశ్వంతపూర్‌ మధ్య వీక్లీ గరీబ్‌ రథ్‌ను ఈన్ట్‌కోన్ట్‌ రైల్వే ప్రవేశ పెట్టనుంది. ప్రతి శెక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు పూరీ-యశ్వంత్‌పూర్‌ గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరుతుంది. ప్రతి శనివారం రాత్రి 10.40 గంటలకు…

మావోయిస్టుల కదలికలపై పోలీసుల తనిఖీలు

విజయనగరం: ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దుల్లో సివిల్‌, సీఆర్పీఎఫ్‌ బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు నిఘా వ్యవస్థ నుంచి సమాచారం అందడంతోనే పోలీసులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

పిడుగుపాటుకు బాలుడి మృతి

ఖమ్మం: జిల్లాలోని వెంకటాపురం మండలం మంగలవాయిలో విషాదం చోటు చేసుకుంది. పిడిగుపాటుకు ఓ బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుని తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికపై నిర్ణయం తీసుకోలేదు: జేడీ

పాట్నా: ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదని జనతదల్‌ అధ్యక్షుడు ఎంపీ బాసిస్త్‌ నారయణ్‌సింగ్‌ తెలిపారు. హమిద్‌ అన్సారీకి మద్దతు ఇచ్చే విషయంలో ఇంకా ఆలోచించలేని పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఎన్డీఏతో…

సైకో సాంబ దొరకలేదు: ఎస్పీ రవికృష్ణ

విజయవాడ: పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న సైకో సాంబశివరావు ఆచూకీ లభ్యం కాలేదని గుంటూరు అర్బన్‌ ఎస్పీ రవికృష్ష స్పష్టం చేశారు. సాంబను పోలీసులు పట్టుకున్నారన్నది కట్టుకథేనని ఆయన తెలిపారు. చీకటి పడటంతో గాలింపు చర్యలను పోలీసులు ఆపేశారు. ఆదివారం…

మంత్రి టీజీ వ్యాఖ్యలపై ఐఏఎస్‌ల ఆగ్రహం

హైదరాబాద్‌: మంత్రి టీజీ వెంకటేష్‌ చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్‌లు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేశౄరు. అధికారులు సక్రమంగా పని చేయకపోతే కాల్చిపారేయాలనడం మంత్రి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఐఏఎస్‌లు పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఉన్నాయన్నారు.…

బీజేపీ కోర్‌ కమిటీ భేటీ

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించేందుకు బీజేపీ కోర్‌ కమిటీ భేటీ అయ్యింది. ఇప్పటికే హమీద్‌ అన్సారీ అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని అద్వానీకి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఫోన్‌ చేశౄరు. అన్సారీకి మద్దతు ఇచ్చే విషయంపై బీజేపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.…

రూ.29కే కిలో సన్న బియ్యం పథకం ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రూ.29లకే కిలో సన్నబియ్యం పథకాన్ని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి శ్రీధర్‌బాబు ఈరోజు కొత్తపేట రైతు బజారులో ప్రారంభించారు. మార్కెట్‌లో మొదటిరకం బియ్యం 35రూపాయలు ఉండగా ప్రభుత్వం 29కే అందిస్తోందని ఈ పథకాన్ని…