మహిళను చితకబాదిన గ్రామస్థులు
మహబూబ్‌నగర్/ నాగర్‌కర్నూలు: కిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో కొండమ్మ నాగమ్మ అనే ఇద్దరు మహిళలు చేతబడి చేస్తున్నారనే నేపంతో గ్రామస్థులు వారిని చితకబాది బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
మహబూబ్‌నగర్/ నాగర్‌కర్నూలు: కిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో కొండమ్మ నాగమ్మ అనే ఇద్దరు మహిళలు చేతబడి చేస్తున్నారనే నేపంతో గ్రామస్థులు వారిని చితకబాది బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
హైదరాబాద్: అవినీతిపై పోరాడుతున్న అన్నాహజారేకు మద్దతుగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో విద్యార్థులు ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ పతాకాలు చేతబూని నినాదాలు చేస్తూ వెళ్లి చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మధుర సేవాసంస్థ ఆధ్వర్యంలో ఈ…
కరీంనగర్/హుజురాబాద్: హుజూరాబాద్‌లోని రైస్‌మిల్లులపై పౌరసరఫరాల శాఖ అధికారుల దాడులు నిర్వహించారు. రేషన్ బియ్యం నిల్వలు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు మిల్లులను తనిఖీ చేయాలని జాయింట్ కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. ఇందులో భాగంగా పట్టణంలోని శోభా రైస్‌మిల్లుపై పెద్దపల్లి,…
కరీంనగర్/మహదేవ్పూర్: మండలంలోని పంచన గ్రామ పంచాయితీ మోదేడు గ్రామంలో విష జ్వరాలు, డయేరియా ప్రబలి ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా వాగులు పొంగి ప్రవహించటంతో రవాణా స్తంభించిపోయింది. వైద్య సిబ్బంది అందుబాటులో లేక గ్రామంలో 20మంది వరకు…
హైదరాబాద్: ఒలంపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం సాధించిపెట్టిన హైదరాబాదీ షూటర్ గగన్‌నారంగ్ తల్లిదండ్రులు ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి గగన్ పేరు తెచ్చారని ప్రశంసించారు.
కరీంనగర్/ సుల్తానాబాద్: మండలంలోని గర్రెపల్లి గ్రామంలో మంగళవారం 63వ వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఎన్ఎన్ఓ భూలక్ష్మీ, ఎంఈవో రాజయ్య, హెచ్ ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్: పట్టణంలో మంగళవారం భారీ వర్షాలకు ఒక ఇల్లు నేలమట్టమైంది. స్థానిక శివాలయం వీధిలో కోడూరి చందయ్య్ర అనే వ్యక్తి ఇల్లు కూలిపోవటంతో ఆ కుటుంబం వీధిన పడింది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరారు.
ఆదిలాబాద్:జిల్లాఓని మంచిర్యాలలో ఓ పాఠశాల పై కప్పుకూలి విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డ సంఘటన చోటుచేసుకుంది. రివిలేషన్ పాఠశాల పైకప్పు కూలటంతో అయిదుగురు విద్యార్థులకు తీవ్రంగా గాయాలయినావి. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.
లండన్: అండన్ ఒలంపిక్స్‌లో ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగం తొలిరౌండ్లో భారత్‌కి చెందిన జయంత్ తాలుక్దార్ తొలిరౌండ్లోనే ఓడిపోయాడు. అమెరికాన్ ఆర్చరీ జాకబ్ చేతిలో 76-86 తేడాతో జయంత్ ఓడిపోయాడు.
కరీంనగర్: సుల్తానాబాద్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న మూడు లీరీలా చౌకధరల బియ్యాన్ని ఈ రోజు అధికారులు పట్టుకున్నారు.