Sunday, 15 November 2026

హైదరాబాద్

కానిస్టేబుల్‌ ఆత్మహత్య

రాజమండ్రి: ఎస్సై వేధింపులకు తాళలేక ఓ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జడ్డంగి పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ శనివారం అర్థరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మెమో ఇచ్చాడని మనస్థాపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు…

తహసీల్ధార్‌ నివాసాల్లో ఏసీబీ సోదాలు

కర్నూలు: కల్లూరు మాజీ తహసీల్దార్‌ అంజనాదేవి నివాసాలపై ఏసీబీ దాడులు నిర్వహించింది. కర్నూలు, గుంటూరు జిల్లాలోని ఆమె నివాసాలపై ఆదివారం ఉదయం అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఆమె డ్రైవర్‌ ఇంటిలో కూడా తనిఖీలు నిర్వహించారు. అవినీతి ఆరోపణలు…

శ్రీకాకుళంలో నేటితో ముగియనున్న సీఎం ఇందిరమ్మబాట

శ్రీకాకుళం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు రోజుల ఇందిరమ్మ బాట కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో నేటితో ముగియనుంది. ఈ ఉదయం పెద్దపాడు సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించి జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రిని సీఎం తనిఖీ చేయనున్నారు. అనంతరం…

విశాఖలో భారీగా గంజాయి పట్టివేత

విశాఖపట్నం: జిల్లాలోని రవికమతం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మూడు వాహనాల్లో తరలిస్తున్న 1500కిలోల గంజాయిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేశామని..మరో ముగ్గురు పరారయ్యారని వారు వెల్లడించారు.

బాక్సింగ్‌ తొలిరౌండ్‌లో విజేందర్‌ విజయం

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌క్‌ భారత బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ తొలి విజయం నమోదుచేశాడు. తొలిరౌండ్‌లో 5-4, 4-3, 5-3తేడాతో కజకిస్థాన్‌ బాక్సర్‌ సుజనోప్‌ను విజేందర్‌ ఓడించారు. దీంతో మిడిల్‌ వెయిట్‌ 75కేజీల విభాగంలో విజేందర్‌కు తొలివిజయం నమోదైంది.

ప్రముఖ నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం కన్నుమూత

చెన్నై: ప్రముఖ నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం (83) అనారోగ్యంతో కన్నుమూశారు. చైన్నైలోని ఓ ఆసుప్రతిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. 1929 అక్టోబర్‌ 25న కృష్ణా జిల్లా కూచిపూడిలో చినసత్యం జన్మించారు. నర్తనశాల సినిమాలో…

ఉద్యోగుల, కార్మికుల సంక్షేమానికి కృషి ఆర్టీసి ఎండీ ఎకే ఖాన్‌

చర్చలు సఫలం.. ఎన్‌ఎంయు హైదరాబాద్‌, జూలై 28 : ఆర్టీసి ఉద్యోగుల, కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం అంగీకరించిందని ఆ సంస్థ ఎండీ ఎకే ఖాన్‌ తెలిపారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్‌ఎంయు తమ దృష్టికి…

రాజకీయ పార్టీ పెట్టను ఎన్నికల్లో పోటీ చేయను అన్నాహజారే

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌, బీజేపీల చేతిలో దేశ భవిష్యత్తు భద్రంగా ఉండదని ప్రముఖ సంఘసేవా కార్యకర్త అన్నా హజారే అన్నారు. తాను స్వయంగా ఎన్నికలలో పాల్గొనబోవటం లేదని శుద్ధమైన నేపధ్యంలో కల వ్యక్తులు నిలబడితే వారి తరపున ప్రచారం చేస్తానని…

ఓయూ జేఏసీ నేతల విస్తృత సమావేశం

సెప్టెంబర్‌ 27న తెలంగాణ కోసం సచివాలయం ముట్టడించాలని పిలుపు హైదరాబాద్‌,జూలై 28 (జనంసాక్షి) :కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో తాడో పేడో తేల్చుకోవడానికి ఓయూ జేఏసీ నాయకులు సిద్దమవుతున్నారు. గత కొంత కాలంగా స్దబ్దుగా ఉన్న ఓయూ జేఏసీ, విద్యార్థి…

ఉప ముఖ్యమంత్రి హామీతో దీక్ష విరమించిన వీహెచ్‌

హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : మేథోమథనం సదస్సు త్వరలో నిర్వహిం చనున్న ట్టు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హామీ మేరకు దీక్ష విరమిస్తున్నానని రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు అన్నారు. మేధో మథనం చేపట్టాలంటూ విహెచ్‌ శనివారం…