Sunday, 8 November 2026

తెలంగాణ

విద్యుత్‌ సౌధ ముందు తెలంగాణా ఉద్యోగుల మహా నిరసన

పంజాగుట్ట (హైదరాబాద్‌): విద్యుత్‌ సౌధ ముందు తెలంగాణ ఉద్యోగులు మహా నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్‌, హరీష్‌రావులతో పాటు పలువురు తెరాస ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

తెలంగాణ సమస్య తేల్చడం అంత సులువు కాదు: సీఎం

తెలంగాణ సమస్యను తేల్చడం అంత సులువైంది. కాదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ సమస్య ఇప్పటిది కాదని గత 50 సంవత్సరాల నుంచి ఉందని అన్నారు. ఈ అంశంపై నిర్ణయం కేంద్రం తీసుకుంటుందని చెప్పారు.

ప్రధాన ప్రతిపక్షంగా అర్హతలేని టీడీపీ: ఆనం రామనారాయణరెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రధాన ప్రతిపక్షంగా ఉండటానికి టీడీపీకి అర్హత లేదని మంత్రి రామనారాయణరెడ్డి అన్నారు. సభాపతి స్థానాన్ని ప్రధాన ప్రతిపక్షం గౌవించడం లేదని విమర్శించారు. సమాధానాలు చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సభ జరగకపోవడానికి విపక్షాల రభసే కారణం అన్నారు.…

రెండు రోజుల పాటు టీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ నుంచి టీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. మొత్తం 20 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు. 16 మంది…

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: పోచారం శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ నుంచి తెలంగాణ సభ్యులను సస్పెండ్‌ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ టీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేలు నాగం జనార్ధన్‌రెడ్డిని సభ నుంచి సస్పెండ్‌ చేసిన అనంతరం…

శాసనసభ నుంచి తెరాస, భాజపా సభ్యుల సస్పెన్షన్‌

హైదరాబాద్‌ : శాసనసభ నుంచి తెరాస, భాజపా సభ్యులను సభాపతి రెండు రోజులపాటు సస్పెండ్‌ చేశారు. తెరాస నుంచి 16 మంది సభ్యులు, భాజపా నుంచి ముగ్గురు సభ్యులు, నాగం జనార్ధన్‌రెడ్డి సస్పెన్సస్‌కు గురయ్యారు. సభ ప్రారంభమైన అనంతరం…

రాష్ట్ర రాజకీయాలపై దృష్టి: పొంగులేటి సుధాకర్‌ రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఏఐసీసీ కార్యదర్శిగా తనని తప్పించాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కోరినట్లు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి చెప్పారు. అందుకే ఏఐసీసీలో మార్పులు జరిగాయన్నారు. తాను ఇక రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టపెడతానని చెప్పారు. రాష్రట&ంలో కాంగ్రెస్‌ అనేక…

అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: ఆనం

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉందని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి చెప్పారు. వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ప్రారంభమైన అనంతరం అయన మాట్లాడారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు.

తిరిగి ప్రారంభమైన శాసనసభ

హైదరాబాద్‌ : వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ప్రారంభమైంది. ఉదయం సభ ప్రారంభ కాగానే తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం చుట్టుముట్టడంతో సభాపతి నాదెండ్లమనోహర్‌ సభను వాయిదా వేశారు. అనంతరం అన్ని పార్టీల శాసనసభాపక్ష నేతలతో తన ఛాంబర్‌లో…

సభ్యులకు క్షమాపక్ష తెలిపిన మండలి ఛైర్మన్‌

హైదరాబాద్‌ : ఎమ్మెల్సీలకు తెలియకుండా స్థాయీ సంఘాల నివేదికలు ప్రవేశపెట్టడంపై మండలి చైర్మన్‌ చక్రపాణి సభ్యులకు క్షమాపణలు తెలిపారు. శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే తమకు సమాచారం ఇవ్వకుండా స్థాయీ సంఘాల నివేదికలు ప్రవేశపెట్టారంటూ సభ్యులు ఆందోళన…