Saturday, 7 November 2026

చాకలి ఐలమ్మ పోరాటమే తెలంగాణా ఉద్యమంకు స్ఫూర్తిఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి బ్యూరో సెప్టెంబర్ 26 (జనంసాక్షి)చాకలి ఐలమ్మ పోరాటమే తెలంగాణా ఉద్యమంకు స్ఫూర్తి అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు.చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె పోరాట పటిమను
స్మరించుకున్నారు.తెలంగాణ వీరనారి ఉద్యమమే ఊపిరిగా పేదల అభివృద్ధే ద్యేయంగా వెట్టిచాకిరి విముక్తిని పారద్రోలి, భూమి కోసం ,భుక్తి కోసం పోరాడిన ధీశాలి మన చాకలి ఐలమ్మ అని అన్నారు.జయంతి వేడుకలే కాదు ఆమె ఆశయాల సాధనకు నేటి యువత అడుగులు వేయాలనీ ఆయన పిలుపునిచ్చారు