రంగంపేటలో తల్లి పాల వారోత్సవాలు

 

జనం సాక్షి/ కొల్చారంఐసిడిఎస్ సూపర్వైజర్ సంతోషకొల్చారం మండలం రంగంపేట అంగన్వాడీ కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు తల్లిపాల విశిష్టత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిన్నపిల్లల బరువు ఎత్తును కొలతలు వేశారు. శిశువు పుట్టిన వెంటనే ముర్రపాలు పట్టించాలని, తద్వారా శిశువు ఆరోగ్యంగా ఎదుగుతాడని అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలు బాలింతలు తీసుకోవాల్సిన ఆహారంపై వారు పలు సూచనలు చేశారు. వారం రోజులపాటు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తామని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సంతోష, ఏఎన్ఎం సంగీత, ఆశా వర్కర్లు, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు