పొన్నాలకు బీఆర్ఎస్ లో సముచిత స్థానం..!!
హైదరాబాద్ :
పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఈరోజు మధ్యాహ్నం పొన్నాల ఇంటికి మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శానంపూడి సైదిరెడ్డి, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ సూచన మేరకే పొన్నాల ఇంటికి వచ్చానని పేర్కొన్నారు. ఆయనకు బీఆర్ఎస్‌లో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. రేపు పొన్నాల సీఎం కేసీఆర్‌ను కలుస్తారు. సీఎంను కలిసిన తర్వాత పొన్నాల తుది నిర్ణయం ప్రకటిస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు.