చంద్రబాబుకు ఆరోగ్యం బాగోలేదు..’ : వైద్యులు
రాజమహేందవ్రరం : కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కీలక నివేదికను బయటపెట్టారు. ఇప్పటివరకు జైలు అధికారులు, ప్రభుత్వ అధికారులు చెప్పినదానికి.. వైద్యులు చెబుతున్న విషయాలకు పొంతన లేకుండా ఉంది. బాబు చేతులు, చాతి, వీపు, ఇతర శరీర భాగాలపై దద్దుర్లు వచ్చాయనీ, స్కిన్ అలర్జీతో తీవ్రంగా బాధపడుతున్నారని వెల్లడిరచారు. ఈ నెల 12న జీజీహెచ్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు వైద్య బృందం వెళ్లి పరీక్షలు చేసి.. జైలు అధికారులకు నివేదిక అందజేసింది.