తల్వార్ తో జన్మదిన వేడుకలు జరిపిన వారికి శిక్ష
ఆర్మూర్, అక్టోబర్ 1 ( జనం సాక్షి):
ఆర్మూరు మండల పరిధిలోని అంకాపూర్ గ్రామంలో పండరీపూర్ చాయ్ హైవే రోడ్డు పక్కన మైనారిటీ యువకులు జన్మదిన వేడుకలను తల్వార్ తో కేకును కట్ చేసి జరిపారు. మైనారిటీ యువకులు హల్చల్ చేస్తూ తల్వార్ తో కేక్ కట్ చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.దీంతో అత్యుత్సాహంగా ప్రదర్శించి జన్మదిన వేడుకలు జరిపిన ఉమర్, షేక్ ముజీబ్ బబ్లు లపై ఆర్మ్స్ యాక్ట్ క్రింద ఇద్దరిని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు.జన్మదిన వేడుకల్లో ప్రమేయమైన మరో 13 మంది మైనారిటీ యువకులను ఆర్మూర్ పోలీసులు బైండోవర్ చేశారు.బహిరంగ ప్రదేశాల్లో, కూడళ్లలో మారణాయుధాలతో ప్రజలను భయపెట్టేలా ప్రవర్తించే వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కాగా కొందరు మధ్యవర్తిత్వం చేస్తామని చెప్పి ఒక్కో యువకుడు వద్ద 15వేల రూపాయలు వసూలు చేసినట్లు పుకార్లు వినబడుతున్నాయి.