రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం

రాష్ట్ర బడ్జెట్‌కు  మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శాసన సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ భేటీ అయింది. ఈ సందర్భంగా బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదించింది. మరికాసేపట్లో భట్టివిక్రమార్క రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. గవర్నర్‌ సీపీ రాధాకృష్ణకు బడ్జెట్‌ పద్దును అందించారు. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ అనుమతి తీసుకోనున్నారు.