Thursday, 5 November 2026

 అంబేడ్కర్‌ను చిన్నతనం చేసింది జగనే: డొక్కా

అమరావతి,మే9(జ‌నం సాక్షి): అంబేద్కర్‌ స్మృతివనం ఒక మహత్తర కార్యక్రమమని మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏడాది పొడవునా అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలు నిర్వహించిన ఘనత తమ ప్రభుత్వానిదని ఆయన అన్నారు. శాసనసభలో అంబేద్కర్‌పై చర్చ జరిగితే దానిని వైసిపి బహిష్కరించిందని గుర్తు చేశారు. వైసిపి అడిగితే స్మృతివనం ఏర్పాటు ఆలోచన మేం చేయలేదని ఆయన చెప్పారు. వైఎస్‌ దళితులకు చేసిన ఒక్క కార్యక్రమం జగన్‌ చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు. వైఎస్‌ విగ్రహాలను అంబేద్కర్‌ విగ్రహాల పక్కన ఎక్కువ ఎత్తులో పెట్టి అవమానించారని అన్నారు. జగన్‌కు సిగ్గు ఉంటే దళితకులకు క్షమాపణ చెప్పాలన్నారు.