Wednesday, 4 November 2026

అంబేడ్కర్‌ జీవితం అందరికీ ఆదర్శం

4

-ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ ఏప్రిల్‌ 20 (జనంసాక్షి):  డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జీవితం అందరికి స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అంబేద్కర్‌ అంతర్జాతీయ కేంద్రానికి పునాదిరాయి వేసిన సందర్భంగా మోడీ మాట్లాడారు. అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అంబేద్కర్‌ ఆశయాలు నెరవేర్చినప్పుడే ఆయనకు ఘనమైన నివాళులర్పించినట్లు అని పేర్కొన్నారు. ద్వేషాలు వీడి సమాజ ఉన్నతికి తోడ్పాటు అందించాలని సూచించారు. అంతకు ముందు విలేకరులతో మాట్ల్లాడుతూ

ప్రతిపక్షం నిర్మాణాత్మక సలహాలివ్వాలని భారత ప్రధాన మంత్రి మోడీ పేర్కొన్నారు. నిర్మాణాత్మకంగా ఇచ్చే సలహాలు స్వీకరిస్తామని అన్నారు. లోక్‌ సభ బడ్జెట్‌ మలివిడత సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా మోడీ విలేకరులతో అన్నారు. మొదటి సమావేశాలు సంతృప్తికరంగా సాగాయని, ఇదంతా విపక్షాల సహాకారంతో జరిగాయన్నారు. అదే విధంగా రెండో దఫా జరిగే సమావేశాలు సజావుగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుందన్నారు. అలా జరగాలని అందరూ కోరుకోవాలన్నారు. ఏదైనా చర్చ ద్వారానే సాధ్యమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *