Monday, 2 November 2026

అంబేడ్కర్‌ మహోన్నత శక్తి

C
– రాజ్యాంగబద్ధంగానే ముందుకెళ్తాం

– రాజ్‌నాథ్‌

– మేము ఆర్యులం కాదు

– మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ, నవంబర్‌26(జనంసాక్షి):

భారత రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా… భారత రాజ్యాంగం- కట్టుబాట్లపై రాజ్‌నాథ్‌సింగ్‌ లోక్‌సభలో చర్చను ప్రారంభించారు. పార్లమెంట్‌ ఉభయ సభలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. రాజ్యాంగ దినోత్సం సందర్భంగా… రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గౌరవార్థం గురు,శుక్రవారాలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌ ఉభయ సభలు అంబేడ్కర్‌ ఘనంగా నివాళులర్పించాయి. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ లోక్‌సభలో  మాట్లాడుతూ…భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్‌ కృషి ఎనలేనిదని కొనియడారు. ఆయన దూరదృష్టి కారణంగానే ఇవాళ రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని, ఇవి ప్రజల్లో ఉన్న అంతరాలను తొలగింఒచేందుకేనని అన్నారు.  నిష్పాక్షికంగా, విమర్శలకు తావులేకుండా అంబేడ్కర్‌ రాజ్యాంగం రూపొందించారన్నారు. అంబేడ్కర్‌ను దళిత వర్గానికి చెందిన నాయకుడిగా సంకుచిత దృష్టితో చూడడం సరికాదన్నారు. రాజకీయ కోణంలో రిజర్వేషన్లను ప్రతిపాదించలేరని, రాజ్యాంగ పరమైన అవసరాలను దృష్టిలో పెట్టుకునే రిజర్వేషన్లు ప్రతిపాదించారన్నారు. సర్దార్‌పటేల్‌ ఓ సంఘటిత శక్తి, అంబేడ్కర్‌ దేశాన్ని ఐక్యం చేశారని వివరించారు. అంబేడ్కర్‌ అవమానాలకు గురైనా ….భారతదేశాన్ని వదిలి వెళ్లాలనుకోలేదని ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.  అంబేడ్కర్‌ భారతదేశానికి మార్గదర్శి, ఓ రుషి అంటూ  అభివర్ణించారు. అంబేడ్కర్‌  నిష్పక్షపాతంగా, విమర్శలకు తావులేకుండా రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు. భారత జాతిని ఏకతాటిపై నిలిపిన మహానుభావుడని  కొనియాడారు. భారత రాజ్యాంగం రూపకల్పనలో అంబేడ్కర్‌ ఎనలేని కృషి చేశారని అన్నారు. సమానత్వం కోసం రిజర్వేషన్లను పరిచయం చేసింది అంబేడ్కరేనని అన్నారు. రాజ్యాంగ ప్రవేశికలో లౌకికవాదం, సామ్యవాదం పదాలను అంబేద్కర్‌ ఎందుకు జోడించారో తెలియడం లేదని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు ఎన్ని అవమానాలు ఎదురైనా తాను మాత్రం లౌకిక పదాలను రాజ్యాంగ ప్రవేశికలో పెట్టారన్నారు. రాజ్‌నాథ్‌ సభలో మాట్లాడుతూ 42వ సవరణపై తన అభిప్రాయాలను వెల్లడిం,దానికి విపరీత భాస్యాలుచెప్పారని  ఆయన ఆరోపించారు. ఒక్క భారత దేశంలోనే ముస్లింలు సామరస్యంగా జీవిస్తున్నారని రాజ్‌నాథ్‌ అన్నారు. ప్రాథమిక హక్కులు రాజ్యాంగ ఆత్మ అని రాజ్‌నాథ్‌ అభిప్రాయపడ్డారు. దేశంలో అస్పృశ్యతను రూపుమాపుతామన్నారు. సమానత్వం కోసం అంబేద్కర్‌ రిజర్వేషన్లను ప్రవేశపెట్టారన్నారు. దేశం కోసం పోరాడి వారికోసమే తాము పనిచేస్తున్నామని అన్నారు.కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. తాము ఇక్కడే పుట్టామని, భయపడి పారిపోయేవాళ్లం కాదని కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున్‌ ఖర్గే అన్నారు. అంబేదర్క్‌..మేమూ ఈ దేశం వాళ్లమే. ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చారు. ముందు నుంచి ఈ నేల మాదే. వేల ఏళ్లుగా అవమానాలు ఎదురవుతున్నా…మేం ఇక్కడే ఉన్నాం. ఈ దేశంలోనే జీవిస్తాం. దేశాన్ని విడిచి వెళ్లమంటూ కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున్‌ ఖర్గే లోకసభలో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు నివాళి అర్పిస్తూ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ తప్పుపట్టింది. రాజ్యాంగ ప్రవేశికలో సెక్యులర్‌ అన్న పదాన్ని అంబేద్కర్‌ ఎందుకు జోడించారో తెలియదన్న రాజ్‌నాథ్‌ మాటలను కాంగ్రెస్‌ సీరియస్‌గా తీసుకుంది. దీనిపై స్పందించిన ఖర్గే ప్రభుత్వాన్ని నిలదీశారు. మేం ఇక్కడి వాళ్లమే. భయపడి పారిపోయేవాళ్లం కాదు. 5వేల ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నామంటూ కాంగ్రెస్‌ నేత ఖర్గే ధీటుగా సమాధానం ఇచ్చారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడతూ… రాజ్యాంగం రూపకల్పనకు మూడేళ్ల సమయం పట్టిందన్నారు. అంబేడ్కర్‌ దూరదృష్టి ఉన్నతమైనదని కొనియడారు. అందరికీ సమాన హక్కుల కల్పన, అంటరానితనం నిర్మూలనకు అంబేడ్కర్‌ కృషి చేశారన్నారు.

26/11 ముంబయి దాడి మృతులకు లోక్‌సభ నివాళి

ముంబయి 26/11 ఉగ్రవాద ఘటనను  లోక్‌సభ గుర్తుచేసుకుంది. 2008 నవంబరు 26న ముంబయి నగరంపై పాక్‌ ఉగ్రవాదులు దాడులు చేయడంతో 166 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నాటి ఘటనలో చనిపోయిన వారికి సభ నివాళులర్పించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని సభ్యులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ నాటి ఘటనలో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన భద్రత దళాల సాహసాన్ని, ధైర్యాన్ని గుర్తుచేశారు. వారిని మరోసారి ప్రశంసించారు. అలాగే ఇటీవల కన్నుమూసిన దాదాపు 13 మంది మాజీ పార్లమెంటు సభ్యులకు లోక్‌సభ నివాళులర్పించింది.  దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 2008లో జరిగిన ఉగ్ర ఘటనకు గురువారంతో  ఏడేళ్లు నిండాయి. ఈ సందర్భంగా ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో మృతులందరికీ ముంబయి ప్రభుత్వం, పోలీసులు నివాళులు అర్పించారు. నివాళులర్పించిన వారిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, మహారాష్ట్ర ఏటీఎస్‌ చీఫ్‌ హేమంత్‌ కార్కరే, ఆర్మీ మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌, ముంబయి అదనపు పోలీస్‌ కమిషనర్‌ అశోక్‌ కాంప్టే సీనియర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ సలాస్కర్‌లు ఉన్నారు. 26/11/2008 ఈ తేదీ గుర్తొస్తేనే భారత్‌ ఉలిక్కిపడుతుంది. ఆ రోజు ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్‌, నారీమన్‌ హౌస్‌, తాజ్‌ ¬టళ్లలో ఉగ్రవాదులు సృష్టించిన నరమేధం గురించి కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఉగ్రవాదులు మోగించిన ఈ మరణ మృదంగంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *