అంబేడ్కర్‌ విగ్రహాలకు పాలాభిషేకాలు

ఒంగోలు,మే9(జ‌నం సాక్షి): అమరావతిలో రూ.125 కోట్లతో అంబేద్కర్‌ స్మృతి వనం నిర్మిస్తామని చంద్రబాబు మూడేళ్ళ  క్రితం హావిూ ఇచ్చారు. హావిూ నెరవేర్చాలని కోరుతూ వైసిపి ఎస్సీ సెల్‌ అధ్యక్షులు మెరుగ నాగార్జున గుంటూరులో మౌన దీక్ష చేపట్టారు. మంగళవారం దీక్షను బలవంతంగా భగం చేసి అరెస్ట్‌ చేసినందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో అంబేద్కర్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని వైసిపి పిలుపునిచ్చింది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో వైసిపి నగర అధ్యక్షులు సింగరాజు వెంకటరావు, ఎస్సీ సెల్‌ నాయకులు పి. రత్నరాజు, బడుగు ఇందిర, సుశీల, సేవాదల్‌ నాయకులు ఓబుల్‌ రెడ్డి, సునీల్‌, సామేలు, తోటపల్లి సోమశేఖర్‌ పాల్గన్నారు.

తాజావార్తలు