Tuesday, 3 November 2026

అంబేద్కర్‌ మహనీయుడు

2

ఆయన సేవలు అమూల్యం

ప్రధాని నరేంద్ర మోడీ

రాష్ట్రపతితోపాటు ప్రముఖుల నివాళి

హైదరాబాద్‌, డిసెంబర్‌6 (జనంసాక్షి) : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మహనీయుడని, ఆయనకు జాతి ఘనంగా నివాళులర్పించిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అంబేద్కర్‌ 59వ వర్ధంతిని పురస్కరించుకుని ప్రభుత్వ పెద్దలు, రాజకీయ పార్టీల నాయకులు ఆయన సేవలను కొనియాడారు. శనివారం ఢిల్లీలో అంబేద్కర్‌ వర్ధంతిని కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. అంబేద్కర్‌ సమాధి వద్ద రాష్ట్రపతి ప్రణబ్‌, ప్రధాని నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. అంద్కేర్‌ మహనీయుడని, ఆయన దేశానికి చేసిన సేవలు అమూల్యమని ప్రధాని కొనియాడారు. తెెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అంబేద్కర్‌ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అంబేద్కర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీ భవన్‌, టీడీపీ కార్యాలయం, టీఆర్‌ఎస్‌ భవన్‌లో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *