ఆదిలాబాద్: అకాల వర్షాలకు జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో జిల్లా ఇంఛార్జ్ మంత్రి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ ప్రెంసాగర్రావు, ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యలు పర్యటించారు. కాగజ్నగర్ మండలంలోని అంధవెల్లి గ్రామంలో పెనుగాలులతో ఇళ్లు కూలి మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలను పరామర్శించారు. వీరికి సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వర్షాలకు తడిసిన పత్తి కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం కాగజ్నగర్ పట్టణంలో దెబ్బతిన్న కాలనీల్లో పర్యటించి నష్టాన్ని పరిశీలించారు.




