హైదరాబాద్ : రైతుల ఆత్మహత్యలపై టీఅసెంబ్లీలో చర్చ జరిగి క్రమంలో గందరగోళం నెలకొంది. ఎంఐఎం నేత అక్బరుద్ధీన్, మంత్రి కేటీఆర్ ఒకరిపైమరొకరు విరుచుకుపడ్డారు. రైతుల ఆత్మహత్యపై సుదీర్ఘం చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎంఐఎం నేత అక్బరుద్ధీన్ మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలు చర్చింలన్నారు. తెలంగాణలో 14వందల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడలేదని ఆయన విమర్శించారు. ప్రతిపక్షం మాట్లాడుతుంటే నవ్వులాటగా ఉందా…అని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యలు అన్ని పార్టీలు కలిసికట్టుగా కృసి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఓ స్మార్ట్ రైతు అని.. ఆయనలాగే అందరు రైతులు స్మార్ట్ రైతుల్లా మారాలన్నారు. ఈక్రమంలో మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని ఇతర విషయాలు, అనవసర విషయాలు మాట్లాడకుండా.. కేవలం రైతు సమస్యలకు పరిమితమై మాట్లాడాలన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ప్రభుత్వాన్ని తప్పుబట్టడంతో అర్థం లేదన్నారు. సీదాగా మాట్లాడాలన్నారు. దీంతో అక్బరుద్ధీన్ ఆగ్రహానికి గురయ్యారు. రైతు ఆత్మహత్యలపై మాట్లాడుతుంటే సీదాగా మాట్లాడాలనడంలో అర్థం లేదన్నారు. సీదా ఎలా మాట్లాడాలో మంత్రి చెప్పాలన్నారు. మంత్రి అసహనం వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రైతులకు రుణాలివ్వాలని బ్యాంకులకు సీరియస్ గా ఎందుకు ఆదేశాలు జారీ చేయడం లేదన్నారు. రైతుల వల్లే టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇరువురి వాదోపవాదాలతో సభలో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది.
అక్బరుద్దీన్, కేటీఆర్ మాటల యుద్ధం




