తెలంగాణకు 128 మంది, ఆంధ్రప్రదేశ్‌కు 166 మంది ఐఏఎస్‌లు
తెలంగాణకు 92, ఆంధ్రకు 119 మంది ఐపీఎస్‌లు
న్యూదిల్లీ, డిసెంబర్ 26(జనంసాక్షి)- తెలంగాణ, ఏపీల రాష్ట్రాల అఖిల భారత సర్వీసు అధికారుల విభజన ప్రక్రియ పూర్తయింది. కేటాయింపు వివరాలను శుక్రవారం రాత్రి కేంద్ర సిబ్బంది మరియు శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్లో ప్రచురించింది. రెండు రోజుల కిందటే సిబ్బంది విభజన ఫైలుపై ప్రధాని నరేంద్ర మోదీ సంతకం చేశారు. అఖిల భారత సర్వీసు సిబ్బంది విభజనకు సంబంధించి కేంద్రం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ అందజేసిన జాబితాను గత అక్టోబరులో మోదీ ఆమోుదించారు. గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన ఏడుగురు అధికారులకు వారు కోరుకున్న రాష్ట్రంలోనే పనిచేసే అవకాశం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 166 మంది ఐఏఎస్‌లను, 119 మంది ఐపీఎస్‌లను కేయాటించగా తెలంగాణకు 128 మంది
ఐఏఎస్‌లను, 92 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారు. ఈ జాబితాపై మరోసారి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అయితే కేవలం ఒకే గ్రేడ్‌లో ఉన్న అధికారుల పరస్పర మార్పిడితోపాటు దంపతుల విజ్ఞప్తులను
మాత్రమే స్వీకరించనున్నారు. అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత 45 రోజుల్లోగా తుది జాబితా ప్రకటించనున్నారు.




