Monday, 2 November 2026

ఆర్నెల్ల తర్వాత తెలంగాణలో ఉద్యోగాలు

7
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి

హైదరాబాద్‌ డిసెంబర్‌ 26(జనంసాక్షి): లక్ష ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయబోతున్నారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి గ్రూప్‌ ఉద్యోగాల నియామకపు ప్రకటనలకు మరో ఆర్నెళ్లు ఆగాల్సి ఉంటుందని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్‌ స్టేడియంలో జరిగిన హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. లక్ష ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయబోతున్నారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అశోక్‌నగర్‌ చుట్టూ తిరిగి డబ్బులు వృథా చేసుకోవద్దని పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు సూచించారు. కొత్తగా తెలంగాణ రాష్ట్రం అవతరించినందున గతంలోని ఏపీ సిలబస్‌ను మార్చాల్సి ఉందన్నారు. గ్రూప్‌ వన్‌, గ్రూప్‌ టూ ద్వారా నియమించే ఉద్యోగులు వచ్చే 35 ఏళ్ల వరకు తెలంగాణ ప్రజలకు సేవలు అందించాల్సి ఉంటుందన్నారు. అలాంటి వారికి తెలంగాణ సామాజిక, భౌగోళిక, చారిత్రక, ఆర్థిక అంశాలు సమగ్రంగా తెలిసి ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సిలబస్‌ రూపొందించేందుకు మరో వారం రోజుల్లోగా నిపుణుల కమిటీని నియమిస్తామని వెల్లడించారు. పదేళ్ల ఉభయ రాష్గాల రాజధాని కావడం, విభజన చట్టాలు వాటన్నింటిని పరిగణలోకి తీసుకుని అడుగులు వేయాల్సి ఉంటుందన్నారు. టీఎస్‌పీఎస్‌సీ ఏర్పాటు, ా’య్రర్మన్‌, సభ్యుల నియామకం ఇటీవలే జరిగిందని, ఇంకా తగిన సిబ్బంది, గదులు అందుబాటులో లేవని తెలిపారు. ఇలాంటి ప్రాథమిక అవరోధాలను అధిగమించేందుకు కొంత సమయం పడుతుందన్నారు. కొత్తసిలబస్‌ రూపొందించిన తరువాత అంతర్జాలంలో పెడతామని, పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు తగిన గడువు ఇస్తామని వివరించారు. గ్రూప్‌ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు గందర గోళానికి గురి కావద్దనే ఉద్దేశంతో వివరాలు తెలియ చేస్తున్నానని అన్నారు. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 ఉద్యోగాలు ఆశిస్తున్నవారు నిరీక్షించాలని ఈలోగా విడుదలయ్యే చిన్న ఉద్యోగాల వైపునకు వెళ్లకపోతేనే బాగుంటుందని పేర్కొన్నారు. ఎలాంటి ప్రకటనలు అయినా ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఉంటాయని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *