Tuesday, 3 November 2026

అగ్నిప్రమాదంలో ఐదు షాపుల దగ్ధం…

అనంతపురం : అమరాపురం మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు షాపులు దగ్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే… ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు రోడ్డు వెంట సుమారు 18 షాపులు ఉన్నాయి. ఆకస్మికంగా ఎగసిన మంటలు ఐదు లకు విస్తరించగా అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వాటిని ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో మొత్తం ఐదు షాపులు దగ్ధం అయ్యాయి. వీటిలో ప్లాస్టిక్ వస్తువులు, బీరువాల విక్రయ షాపులు, హోటల్ ఉన్నాయి. ఎవరో కావాలనే నిప్పంటించారని బాధితులు ఆరోపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *