పూతలపట్టు (చిత్తూరు): పూతలపట్టు మండలం రంగంపేట వద్ద ఉన్న గల్లాపుడ్స్ పరిశ్రమంలో విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 700 టన్నుల మామిడి తాండ్ర దగ్ధమైంది. నష్టం విలువ రూ. 1.5కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.




