మంత్రి
పరవాడ : విశాఖ జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో రెండు రోజుల క్రితం అగ్ని ప్రమాదానికి గురైన గ్లోకెం ఔషధ పరిశ్రమను మంత్రి బాలరాజు పరిశీలించారు. ప్రమాదంలో కాలిబూడిదైన బ్లాకులను పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఫార్మా పరిశ్రమలు ఎస్‌వోసీ అనుమతులు లేకుండా ఉత్పత్తిని ప్రారంభించడం నేరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే రమేశ్‌బాబు, ఆర్డీవో రంగయ్య, తహశీల్దార్ వెంకటేష్ తదితరులు ఉన్నారు.




