న్యూఢిల్లీ జనం సాక్షి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతను కాంగ్రెస్ అధిష్ఠానం ఆపార్టీ నేత అజయ్ మాకెన్ భుజాలపై వేసింది. ఇవాళ ఆయన నేతృత్వంలో 101 మంది సభ్యులతో కూడిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార కమిటీని నియమించింది. ఢిల్లీలో కాంగ్రెస్‌పార్టీని గెలిపించేలా పనిచేయాలని ఆదేశించింది. కాగా, ఢిల్లీ అసెంబ్లీకి పోటీచేసే 45 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ తయారు చేసింది. రేపు అధికారికంగా జాబితాను విడుదల చేయనుంది.




