
– హైదరాబాద్‌పై 10 వేల నిఘా నేత్రాలు
– కమాండ్ కంట్రోల్ కేంద్రాలకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్:హైదరాబాద్ నగరాన అడుగడుగునా నిఘానేత్రాలు తెరుచుకోనున్నాయి. అత్యుంత్త ప్రతిష్ట భద్రతకు అంకురార్పణ జరిగింది. ఆధునిక టెక్నాలజీ వచ్చినపుడు అందిపుచ్చుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం నాడు నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో పోలీసు ట్విన్ టవర్స్‌కు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. సింగపూర్, న్యూయార్కు తర్వాత హైదరాబాద్‌లోనే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటవుతోందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించుకోవడం వల్లే ఆ దేశాల్లో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నాయని, నేరాలు తక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ వ్యవస్థను ఏవరైనా సరే విపత్తు కాలంలో వినియోగించుకోవచ్చని తెలిపారు. మన రాష్ట్ర పోలీసు వ్యవస్థ చాలా పటిష్టమైనదని, జాతీయస్థాయిలో మంచి పేరుందని కొనియాడారు. తాను జాతీయస్థాయి నేతలను కలిసినపుడు రావుగారు విూ పోలీసు వ్యవస్థ చాలా గట్టిదని పొగిడారని తెలిపారు. అత్యాధునిక హంగులతోఅంతర్జాతీయ స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తున్నామన్నారు. ప్రస్తుతం రూ.320 కోట్లు నిర్మాణం కోసం కేటాయిస్తున్నామని, వచ్చే బడ్జెట్లో రూ.700 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. సింగపూర్, చైనాలో పోలీసులు రోడ్లపై కనిపించరని తెలిపారు. మొత్తం సీసీ కెమెరాలతోనే పరిశీలిస్తారని వివరించారు. ఎవరైనా ఆపద సమయంలో ఫోన్ చేస్తే నిమిషాల్లో ఇంగ్లీష్ సినిమాల్లో వచ్చినట్టు దిగుతారని పేర్కొన్నారు. పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ఈ విషయంలో చాలా అంకితభావంతో పనిచేశారని కితాబిచ్చారు.తెలంగాణలో పోలీసుల భాష గతంలోలాగా లేదని చాలా మారిపోయిందన్నారు. ఈ విషయాన్ని తనతో చాలా మంది అన్నారని పేర్కొన్నారు. పోలీసులు ఎంతో హుందాగా, మర్యాదగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఇకపై కూడా ఇలాగే కొనసాగాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పోలీసు వ్యవస్థ బలోపేతం కానుందన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కంట్రోల్ వ్యవస్థను విపత్తు సమయంలో పోలీసులే కాక అందరూ వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రకృతి వైఫరీత్యాలు సంభవించినపుడు కూడా ఈ కంట్రోల్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షించవచ్చని సూచించారు.రెండు కంట్రోల్ టవర్లలో మొదటి టవర్‌లో 24 అంతస్థులు, రెండో అంతస్థులో 17 అంతస్థులు ఉంటాయని వివరించారు. ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ హైదరాబాద్ నగరానికే తలమానికంగా నిలిచిపోనుందని తెలిపారు. మన దగ్గర మంచి పోలీసు ఆఫీసర్లు ఉన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మరో 10 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. క్రైం కంట్రోల్లో ప్రజల సహకారం కూడా అవసరమన్నారు. తప్పులన్నీ పోలీసులవే అన్నట్టుగా వ్యవహరించరాదన్నారు. గతంలో పోలీసు డీజీపీలు కూడా చాలా సమర్థవంతంగా శాంతిభద్రతలను పరిరక్షించిన విషయాన్ని గుర్తు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు కూడా మారారని వివరించారు.పోలీసుల్లో చాలా మార్పు వచ్చిందని సీఎం అన్నారు. ముపటిలా మామూళ్లు అడగటంలేదని తనతో చాలా మంది అన్నారని వివరించారు. ఎందుకంటే ప్రభుత్వమే పోలీసు స్టేషన్లకు నెలానెలా అయ్యే ఖర్చులను మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు పొల్యూషన్లో పనిచేస్తున్నారని అందుకే వారి కోసం వేతనంలో 30 శాతం అధికంగా చెల్లిస్తున్నామన్నారు. ప్రభుత్వం కట్టించే ఇండ్లలో ప్రతీ యేటా పోలీసులకు పది శాతం ఇండ్లను కేటాయిస్తామన్నారు. పోలీసులు అవినీతిరహితంగా, ఉత్సాహంగా పనిచేయాలని, శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరారు.ఈ సందర్భంగా ¬ంమంత్రి నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థను ఆధునీకరించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ వ్యవస్థను కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి అనుసంధానం చేస్తామని అన్నారు. పోలీసు వ్యవస్థలో మహిళలకు ప్రాధాన్యతనిస్తామన్నారు. ఇందు కోసం వారికి పోలీసు నియామకాల్లో 33 శాతం కోటా ఇస్తామన్నారు. నిఘా కోసం హైదరాబాద్ మహానగరం అంతా విడతలవారీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హావిూ ఇచ్చారు.పోలీసు కమాండ్ కంట్రోల్ సిస్టమ్ నేరాలను పూర్తిగా అదుపు చేసేందుకు దోహదపడుతుందని అన్నారు. కమాండ్ కంట్రోల్లో ప్రభుత్వంలోని అన్ని శాఖలను అనుసంధానం చేస్తామన్నారు. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు మూడు వేల మంది పోలీసులు పనిచేస్తున్నారని వివరించారు. రాబోయే కాలంలో టెక్నాలజీతో ఒక్క పోలీసు కూడా లేకుండా ట్రాఫిక్‌ను నియంత్రించ వచ్చని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతీ క్రైమ్ కేసులో సాక్ష్యాలను సులువుగా కనుగొన వచ్చని తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, ¬ంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజీపీ అనురాగ్ శర్మ, పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు, ఇతర నేతలు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.




