Tuesday, 3 November 2026

బీఫ్‌ వ్యాపారంలో 95 శాతం హిందువులు

5
– వరల్డ్‌ సెక్యూరిటీ అండ్‌ రాడికల్‌ ఇస్లాం సదస్సులో జస్టిస్‌ రాజింద్‌ సచార్‌

మధుర,నవంబర్‌21(జనంసాక్షి):  భారత్‌లో జరిగే బీఫ్‌ వ్యాపారం నిర్వహించే వారిలో 95 శాతం మంది హిందువులే  ఉన్నారని  ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజిందర్‌ అన్నారు. గోమాంసం వివాదంతో దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు చల్లారక ముందే ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజిందర్‌ సచార్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మధురలో ‘వరల్డ్‌ సెక్యురిటీ అండ్‌ రాడికల్‌ ఇస్లాం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సచార్‌ మాట్లాడుతూ.. ఇండియాలో గోమాంసం వ్యాపారం చేసే వారిలో ముస్లింల కంటే ఎక్కువగా హిందువులే ఉన్నారు, బీఫ్‌ వ్యాపారం చేసే వారిలో 95 శాతం మంది హిందువులే అని వ్యాఖ్యానించారు. ఆహారపు అలవాట్లకు, మతానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ మాటకొస్తే నేను కూడా బీఫ్‌ తింటాను అని అన్నారు.ఇండియాతో పాటు కెనడా, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌కు చెందిన పరిశో

ధక విద్యార్థులు పాల్గొన్న ఈ సద స్సులో సచార్‌ వ్యా ఖ్యలపై నిరస న లు వ్యక్తమ య్యా యి. కొందరు వి ద్యా ర్థులు సచార్‌ ఉపన్యాసాన్ని ఆపా ల్సిందిగా కోరాగా మరికొందరు హాల్‌ లోని లైట్‌ లు, ఫ్యాన్‌లను ఆపేసి తమ నిరసన తెలిపారు. ముస్లిం రాడికల్‌ విధానాలపై జరుగుతున్న సదస్సును యాంటీ హిందూ సదస్సుగా మార్చాడంటూ

సచార్‌పై విద్యార్థులు ఆగ్రహం  వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *