అత్యాచారయత్నం ఆరోపణలో టిడిపి నేత
పార్టీనుంచి బహిష్కరణ
కాకినాడ,మే7(జనం సాక్షి): బాలికపై అత్యాచారానికి యత్నించారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి తెలుగుదేశం పార్టీ నేతల కే శ్రీనివాస్ ను సస్పెండ్ చేసినట్టు ప్రకటన వెలువడింది. కత్తిపూటి ఎంపీటీసీ సభ్యురాలి భర్త అయిన శ్రీనివాస్, ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేయాలని ప్రయత్నించినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. బాలిక పట్ల ఆయన వ్యవహరించిన తీరును ఖండిస్తూ, అతనిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని ప్రకటించిన పార్టీ, అతన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు ఈ మేరకు పత్రికలకు ప్రకటన విడుదల చేశారు.