అత్యాచారాలకు మహిళలే బాధ్యులు!
మహిళలపై అకృత్యాలకు వారినే నిందించడం సమాజ్‌వాదీ పార్టీ నేతలకు పరిపాటిగా మారింది. రేప్‌లకు మహిళలే కారణమంటూ హమీర్పూర్ ఎమ్మెల్యే శివచరణ్ ప్రజాపతి వ్యాఖ్యానించారు. ‘అత్యాచారాల్లో మహిళలదేమీ తప్పు లేదనడం సరికాదు. రేప్‌లకు పూర్తి బాధ్యత వారిదే’ అన్నారు. మహిళల భేటీలోనే ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే గర్భస్రావాలు, వరకట్న వేధింపులలోనూ మహిళల పాత్ర తక్కువేమీ కాదన్నారు. అదే వేదికపై ఉన్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ జరీనా ఉస్మానీ ఆయన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే సర్దుకున్న ఎమ్మెల్యే.. తానేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలని కోరారు. కాగా, ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేసినరోజే ముగ్గురిపై అత్యాచారం జరిగింది!