అత్యాచార బాధితురాలికి అండగా ఉంటా: నన్నపనేని

విజయవాడ,జూన్‌30(జ‌నం సాక్షి): అత్యాచార బాధితులు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలు లాంటివి చేసుకోవద్దని ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి విజ్ఞప్తి చేశారు. వారికి తాము అండగా ఉన్నామని హావిూ ఇచ్చారు. ప్రభుత్వం, చట్టాలు వారికి అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. విజయవాడలోని ఎన్టీఆర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో కృష్ణా జిల్లాలోని ఆగిరిపల్లి అత్యాచార బాధితురాలిని ఆమె పరామర్శించారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ.. బాధితురాలు మానసికంగా కుంగిపోతోందని, ఆమెకు ధైర్యం చెప్పానని వెల్లడించారు. ముఖ్యమంత్రి వద్దకు ఆమెను స్వయంగా తీసుకెళ్తానని, ఎంటెక్‌ వరకు ఆమెను ప్రభుత్వం చదివిస్తుందని హావిూ ఇచ్చారు. ఇలాంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు పరువు పోతుందని వెనకడుగు వేయకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు.