అది మరణం లాంటి అనుభవం :ద్రావిడ్
కోల్‌కత్తా ,మే 23 (జనంసాక్షి):
ప్రపంచ క్రికెట్‌లో రాహుల్ ద్రావిడ్ నిజాయితీని ఎవ్వరూ ప్రశ్నించలేరు. మైదానంలోనూ , బయటా వివాదాలకు దూరంగా ఉండే అతికొద్ది మంది క్రికెటర్లతో ద్రావిడ్ ఒకడు. సహనమే ఆయుధంగా ఆడే ప్లేయం. మిస్టర్ క్లీన్‌గా అభిమానులే పిలుచుకునే ద్రావిడ్ కెరీర్ లో తొలిసారిగా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఐపీఎల్‌లో స్పాట్‌ఫిక్సింగ్ ఆరోపణలతో తన జట్టులోని ముగ్గురు ఆటగాళ్ళు జైలుపాలవడం మానసికంగా ఎంతో ఇబ్బందిని తెచ్చిపెట్టింది. తాను సారథ్యం వహిస్తోన్న జట్టులో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంటే ఏ కెప్టెన్‌కైనా బాధగానే ఉంటుంది. హైదరాబాదలో రాజస్థాన్ మ్యాచ్ ఆడడానికి ముందు ఈ స్పాట్‌ఫిక్సింగ్ వివాదం వెలుగులోకి వచ్చి ఆటగాళ్ళు అరెస్టయ్యారు. అప్పటి నుండీ ద్రావిడ్ ముఖంలో విచారమే కనిపించింది.మీడియా సమావేశంలో తలదించుకుని మాట్లాడి వెళ్ళిపోయిన తీరు విలేఖరులకు కూడా బాధ కలిగించింది. ఎప్పుడూ నిజాయితీగా వ్యవహరించే ద్రావిడ్ లాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావడం అభిమానులకు కూడా విచారం కలిగించింది. అయితే ఇలాంటి క్లిష్టపరిస్థుతుల్లో జట్టును సమర్థంగా ముందుకు నడిపిస్తూ రెండో క్వాలిఫైయంగా అర్హత సాధించడంలో విజయవంతమయ్యాడు. రైజర్స్ పై మ్యాచ్ గెలిచిన తర్వాత ద్రావిడ్ ముఖంలో కాస్త సంతోషం కనిపించింది. ఈ సందర్భంగా స్పాట్‌ఫిక్సింగ్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఫిక్సింగ్ ఆరోపణల తనకు మరణం లాంటి అనుభవం కలిగించాయని వ్యాఖ్యానించాడు. ఆ వివాదం తర్వాత జట్టు చాలా క్లిష్టమై న పరిస్థితిని ఎదుర్కొందని , జీవితం లో ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదని చెప్పాడు. గత ఐదు రోజులుగా జట్టులో భిన్నమైన హావ భావాలు కనిపించాయని , తనకైతే మరణం లాంటి పరిస్థితిలా ఉందని ఆవేదనగా చెప్పాడు. అయితే ఇటువంటి పరిస్థుతుల్లో తమ జట్టు సన్‌రైజర్స్ పై సమిష్టిగా రాణించి విజయం సాధించడం ఊరటనిచ్చి ందని వ్యాఖ్యానించాడు.ాజస్థాన్ ఢీనేడు రెండో క్వాలిఫైయర్ లో ముంబై , రాజస్థాన్ ఢీనేడు రెండో క్వాలిఫైయర్ లో ముంబై , రాజస్థాన్ ఢీనేడు రెండో క్వాలిఫైయర్ లో ముంబై , రాజస్థాన్ ఢీనేడు రెండో క్వాలిఫైయర్ లో ముంబై , రాజస్థాన్ ఢీక్వాలిఫైయర్ లో ముంబై , రనేడు రెండో క్వాలిఫైయర్ లో ముంబై , రాజస్థాన్ ఢీనేడు రెండో క్వాలిఫైయర్ లో ముంబై , రాజస్థాన్ ఢీాజస్థాన్ ఢీనేడు రెండో క్వాలిఫైయర్ లో ముంబై , రాజస్థాన్ ఢీనేడు రెండో క్వాలిఫైయర్ లో ముంబై , రాజస్థాన్ ఢీనేడు రెండో క్వాలిఫైయర్ లో ముంబై , రాజస్థాన్ ఢీనేడు రెండో క్వాలిఫైయర్ లో ముంబై , రాజస్థాన్ ఢీ