Tuesday, 3 November 2026

అధికారులపై సీఎం కేసీఆర్‌ గుస్సా..

C

– నిర్లక్ష్యం వహిస్తే సహించం

– నాలుగు గంటల పాటు ముఖ్యమంత్రి సమీక్ష

వరంగల్‌,జనవరి 5(జనంసాక్షి): విధుల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌ జిల్లా అభివృద్ధిపై అధికారులతో సీఎం సుమారు 4గంటలపాటు సవిూక్ష నిర్వహించారు. ఈ సవిూక్షలో గ్రావిూణ నీటిపారుదల శాఖ అధికారులు, ఆర్‌అండ్‌బీ ,పంచాయతీ రాజ్‌ శాఖ అధికారుల పనితీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను సీఎం హెచ్చరించారు.  వరంగల్‌ జిల్లాలో జరుగుతున్న మిషన్‌ భగీరథ పనులను సీఎం కేసీఆర్‌ సవిూక్షించారు. వరంగల్‌ జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడే అధికారులు, వర్కింగ్‌ ఏజన్సీలతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంచినీరు అందించాలని నిర్ణయించామన్నారు. వరంగల్‌ జిల్లా జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గాలతో పాటు మెదక్‌ జిల్లా గజ్వేల్‌, సిద్దిపేట, దుబ్బాక, నల్గొండ జిల్లా ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాలకు నాలుగు నెలల్లోనే మంచినీరు ఇవ్వాలని స్పష్టం చేశారు. పైపులైన్ల ఏర్పాటుతో పాటు అన్ని పనులు సమాంతరంగా జరగాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి వారం వారం కార్యాచరణ రూపొందించి, దానికి అనుగుణంగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారులు, వర్కింగ్‌ ఏజెన్సీల వెంటపడి పనులు చేయించే బాధ్యత ప్రజాప్రతినిధులు స్వీకరించాలన్నారు. వరంగల్‌ జిల్లాలో ఐదు సెగ్మెంట్ల ద్వారా పనులు జరుగుతున్నాయని, ఇన్‌ టేక్‌ వెల్స్‌, వాటర్‌ ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్లు, పైప్‌ లైన్స్‌, నల్లాలు, గ్రామాల్లో పైప్‌ లైన్స్‌ తదితర పనులను సిఎం కేసీఆర్‌ సవిూక్షించారు. ఏ మండలానికి ఎక్కడి నుంచి నీరు తెస్తారు? వాటి పనుల పురోగతి అంశాన్ని ముఖ్యమంత్రి స్థానిక అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. పైప్‌ లైన్‌ నిర్మాణానికి రైట్‌ ఆఫ్‌ వే చట్టాన్ని తెచ్చినందున, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. విద్యుత్‌ లైన్ల నిర్మాణంపై కూడా సిఎం కేసీఆర్‌ సవిూక్షించారు. పైప్‌ లైన్స్‌ నిర్మాణం అయిన వెంటనే నీరు ఇచ్చే విధంగా విద్యుత్‌ సరఫరా జరగాలని ఆదేశించారు. పాలేరు, ఎల్‌ఎండి, హెచ్‌ఎండబ్ల్యుఎస్‌, గోదావరి, మంగపేట సెగ్మెంట్ల ద్వారా జిల్లాలోని అన్ని మండలాలకు వచ్చే ఏడాది మార్చి నాటికి మంచినీళ్లు ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు. మిషన్‌ కాకతీయ మొదటి విడతలో చేపట్టిన 1,062 చెరువుల పునరుద్ధరణ పనులను, రెండో విడతలో చేపట్టే పనులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవిూక్షించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు చేయాలని, గత ఏడాది చేపట్టిన పనులను మార్చి నాటికి పూర్తి చేయాలని, రెండో విడత కార్యక్రమం వెంటనే ప్రారంభించాలని, అన్ని పనులూ సమాంతరంగా జరగాలని ఆదేశించారు. చెరువు భూములు కాపాడడానికి సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించాలన్నారు. చెరువు చుట్టూ చెట్లు పెంచాలని చెప్పారు. పూడిక మట్టిని పొలాలకు తరలించాలని, పొలాలకు పనికి రాని మట్టితో పాడుపడిన బావులు, బొందలు పూడ్చాలని ఆదేశించారు. చెరువు హద్దులు నిర్ణయించడానికి ఔట్‌ సోర్సింగ్‌ ఏజన్సీలతో సర్వే చేయించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నదన్నారు. చెరువుల పునరుద్ధరణ, హద్దుల నిర్ణయంలో ఆయకట్టు దారులను భాగస్వాములను చేయాలన్నారు. జిల్లాలోని భారీ నీటి పారుదల ప్రాజెక్టులపైనా సీఎం కేసీఆర్‌ సవిూక్ష జరిపారు. ఎనిమిది వేల క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన కాకతీయ కాలువల మరమ్మత్తు పనులను ముఖ్యమంత్రి సవిూక్షించారు. పూర్తి స్థాయి నీటి ప్రవాహ సామర్థ్యం ప్రకారం నీరు ప్రవహించేలా కాలువలు సిద్దం చేయాలన్నారు. మెయిన్‌ కాలువతోపాటు, డిస్ట్రిబ్యూటరీలు, ఫీల్డ్‌ కెనాల్స్‌ బాగు చేయాలని చెప్పారు. కాకతీయ కాలువకు ఎక్కడ ఏ పని చేయాలనే విషయంపై అంచనాలు రూపొందించాలన్నారు. దేవాదుల ప్రాజెక్టును ఉపయుక్తమైన ప్రాజెక్టుగా మార్చాలన్నారు. దేవాదుల కింద కట్టాల్సిన రిజర్వాయర్లకు భూసేకరణ జరపాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో రిజర్వాయర్లు లేకుండానే కాల్వలు తవ్వారని, ఇప్పుడు కాలువలన్నీ ఉపయోగంలోకి వచ్చే విధంగా రిజర్వాయర్లు నిర్మించాలన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్‌ ద్వారా జిల్లా అంతటికి నీరందుతుందన్నారు. దేవాదులకు బ్యారేజ్‌ కట్టి ములుగు, నర్సంపేట, భూపాలపల్లి, పరకాల-మల్లన్నసాగర్‌, ద్వారా జనగామ, స్టేషన్‌ ఘనపూర్‌, కొంతమేర పాలకుర్తికి, ఎస్‌ఆర్‌ఎస్పి ద్వారా వర్థన్నపేట, పాలకుర్తి, మానుకోట, డోర్నకల్‌ నియోజకవర్గాలకు నీరు అందుతుందన్నారు. కరువు పరిస్థితులున్న జనగామ, స్టేషన్‌ ఘనపూర్‌, పాలకుర్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, దేవాదుల ద్వారా మూడు నియోజకవర్గాల్లో చెరువులు నింపాలని ఆదేశించారు. దేవాదుల, ఎస్‌ఆర్‌ఎస్పి ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు అవసరమైన రిజర్వాయర్లు కట్టాలని చెప్పారు. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం ప్రాజెక్టు కింద రొళ్లపాడు, బయ్యారం రిజర్వాయర్ల ద్వారా మహబూబాబాద్‌, డొర్నకల్‌ నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ దాదాపు పూర్తయిందని, కాళేశ్వరం ప్రాజెక్టుపై త్వరలోనే మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకుంటామని, వాటిపై అవగాహన కల్పించేందుకు త్వరలో ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. తులారాం ప్రాజెక్టు, గౌరారం ప్రాజెక్టులను మరింత ఉపయోగకరంగా మార్చాలని, జంపన్నవాగుపై, ఆకేరు వాగుపై చెక్‌ డ్యాములు నిర్మించాలన్నారు. భూ నిర్వాసితులకు మేలు కలిగే విధంగా భూ కొనుగోలు విధానం తెచ్చినందున, దానిని సరిగా వినియోగించుకుని ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ విధానానికి బదులుగా భూమి విలువ, ఆస్తి పరిహారం, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇంటి సొమ్ము మూడూ ఒకేసారి చెల్లించాలన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలపైన ముఖ్యమంత్రి సవిూక్షించారు. ఈ పథకాల కింద ఇచ్చే డబ్బులు పెండ్లికి ముందే అందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పెండ్లి చేసే ఆడపిల్ల తల్లికి డబ్బులు అందే విధానం రూపొందిస్తామన్నారు. ఈ పథకంలో ఎట్టి పరిస్థితుల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

వరంగల్‌ సర్వతోముఖాభివృద్దికి పరణాళికలు

వరంగల్‌ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. త్వరలో వరంగల్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డును నిర్మిస్తామని అన్నారు.  ప్రాజెక్టుల రీ డిజైన్‌లో వరంగల్‌కు ఎక్కువ మేలు జరుగుతుందన్నారు.  రూ. 130 కోట్లతో ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాకతీయ కాలువ మరమ్మతులు చేస్తున్నట్లు వెట్టడించారు. వరంగల్‌ పర్యటనలో ఉన్న సీఎం మంగలవారం  సాయంత్రం జిల్లా అభివృద్ధిపై సవిూక్ష చేపట్టారు. ఈ సమావేశంలో స్పీకర్‌ ముధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్‌లతో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వరంగల్‌ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. బడ్జెట్‌లో ప్రతీ ఏటా వరంగల్‌కు రూ. 300 కోట్లు కేటాయిస్తామని అన్నారు. ఈ నిధులు  వరంగల్‌ కోట, కాకతీయులు నిర్మించిన చెరువులు పర్యాటకరంగ అభివృద్ధికి దోహదపడుతాయన్నారు.   కాలువ మరమ్మతులకు ఇంకా ఎన్ని నిధులు కావాలన్న ఇస్తామని,. మిషన్‌ భగీరథ ద్వారా వరంగల్‌ జిల్లాలోని ప్రతీ ఇంటికి మంచినీరు అందించేలా చూడాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడుతాయని ప్రజలు ఆశించారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు ముందుకు పోతున్నం. 15 శాతం స్థిరమైన ఆర్థిక వృద్ధితో రాష్ట్రం ముందడుగు వేస్తుంది. దానికి అనుగుణంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసుకుంటూ ముందుకుపోవాలన్నారు. . ప్రజల అవసరాల మేరకు నిధులు ఖర్చు చేయాలనే ఉద్దేశ్యంతో కొత్త పంథాలో బడ్జెట్‌ ప్రవేశపెడ్తున్నట్లు వెల్లడించారు.  వరంగల్‌ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. . ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చాలని సీఎం ఆదేశించారు. వరంగల్‌ నగరం లోపల, పరిసరాల్లో ప్రభుత్వ భూములు గుర్తించి,వాటిలో పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని హావిూఇచ్చారు.  నగరంలోని ఆటోనగర్‌ను సిటీ అవతల ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు.  వరంగల్‌ సిటీలో బస్‌ బేలు సరిగా లేవని అన్నారు.  స్మశాన వాటికలు, శానిటేషన్‌ బాగాలేదు. ప్రణాళిక ప్రకారం నగరాభివృద్ధి చేద్దాం. త్వరలోనే హెల్త్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తం. వరంగల్‌ ఎంజీఎంను మాత, శిశు సంరక్షణ కేంద్రంగా మార్చాలి. నిమ్స్‌ తరహాలో మరో కొత్త ఆస్పత్రిని ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఎంజీఎంలోని శిథిల భవనాలను తొలగించి కొత్త టవర్స్‌ నిర్మించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *