Tuesday, 3 November 2026

అధ్యక్షుడిగా పోటీ చేసే వ్యక్తి హుందాగా ఉండాలి :ఏంజెలినా

Angelina-Trumpఅమెరికా అధ్యక్షపదవికి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థైన డొనాల్డ్‌ ట్రంప్‌ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలపై హాలీవుడ్‌ నటి ఏంజెలినా జోలీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అగ్రరాజ్య అధ్యక్ష పదవి రేసులో ఉన్న ట్రంప్‌ లాంటి వ్యక్తి నుంచి అలాంటి వ్యాఖ్యలు వింటాననుకోలేదని ఆమె అన్నారు. లండన్‌లో బీబీసీ ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఏంజెలినా పాల్గొన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన వలసదారులతో అమెరికా ఏర్పడిందని.. అలాంటి దేశానికి అధ్యక్షుడిగా పోటీ చేసే వ్యక్తి హుందాగా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *