Tuesday, 3 November 2026

సర్పంచ్ భర్త దారుణ హత్య

తిరుపూరు: కృష్ణా జిల్లా తిరుపూరు మండలం అక్కపాళెం గ్రామ సర్పంచ్ వెంకటరమణ భర్త నాగేశ్వరరావును గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారు. ఊరి చివర వాటర్ ట్యాంక్ సమీపంలో నాగేశ్వరరావు మృతదేహాన్ని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాగేశ్వరావును పథకం ప్రకారమే హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. మృతుడు నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *