Tuesday, 3 November 2026

అధ్యక్ష ఎన్నిక నిర్వహించకపోతే ఆత్మహత్య చేసుకుంటా

– మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి
నాగరాజుపేట: కడప జిల్లా నాగరాజుపేట డీసీసీబీ బ్యాంకు వద్ద వైకాపా ఎమ్మెల్యేలు డీసీసీబీ ఛైర్మన్‌ ఎన్నిక చేపట్టాలని ధర్నా చేపట్టారు. అధ్యక్ష ఎన్నిక ఈరోజు చేపట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటానని వైఎస్‌ సోదరుడు మాజీ మంత్రి వివేకానందరెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీరిశివారెడ్డి అనుచరులు మంగళవారం రాత్రి జిల్లా సహకార అధికారి చంద్రశేఖర్‌ను కిడ్నాప్‌ చేశారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా కార్యాలయం వద్ద వైకాపా, కాంగ్రెస్‌ వర్గీయుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *