Friday, 6 November 2026

అనుకున్న సమయానికే పోలవరం పూర్తి:దేవినేని

విజయవాడ,మే 22 (జ‌నం సాక్షి): పోలవరం ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, కాంక్రీట్‌ పనుల్లో వేగం పెరగాలని అధికారులకు సిఎం చందరబాబు నాయుడు  సూచించారని మంత్రి దేవినేని ఉమా అన్నారు. 2018 నాటికి అనుకున్న విధంగా నీటిని అందిస్తామని, 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. గ్రావిటీ ద్వారా నీరందించాలంటే భూసేకరణ పూర్తికావాలని, ఇప్పటికే ఖర్చు చేసిన నిధులను ఇవ్వాలని కేంద్రాన్ని అడుగుతున్నామని సీఎం చెప్పారు. అనుకున్న సమయానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డెల్టా ఆధునీకరణకు ప్రణాళికలు రూపొందించాలని, గోదావరి జిల్లాల కలెక్టర్లను సిఎం ఇప్పటికే ఆదేశించారు.  జూన్‌ ఒకటి నుంచి గోదావరి కాలువలకు నీటి విడుదల చేస్తామని తెలిపారు. తుపాన్లకు ముందే మొదటి పంట చేతికి అందేలా చర్యలు తీసుకుంటామని, పులిచింతల నీటితో కృష్ణా డెల్టాలో మొదటి పంటకు నీరు అందిస్తామని స్పష్టంచేశారు.
——-