Friday, 6 November 2026

వర్ణశోభితంగా మహానాడు ఏర్పాట్లు

పార్టీనేతలకు చక్కని ఏర్పాట్లు: మంత్రి
విజయవాడ,మే 22(జ‌నం సాక్షి): విజయవాడ మహానాడును పండుగాల నిర్వహిస్తామని మంత్రి కళా వెంకట్రావు  అన్నారు. ఇక్కడ ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావచ్చాయని అన్నారు. ఎండాకాలం కావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పార్టీ కార్యకర్తలు, నేతలకు చక్కని వసతి, భోజనం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నగరంలో జరగనున్న మహానాడు నేపథ్యంలో తెలుగు రాష్ట్రా నుంచి వచ్చే ప్రతినిధులను విశేషంగా ఆకర్షించేలా నగరాన్ని అలంకరించాలని కూడా  నేతలు నిర్ణయించారు. 26వ తేదీ సాయంత్రం నుంచే నగరానికి వచ్చే ప్రతినిధుల తాకిడి మొదలవుతుంది. ఉదయం 10గంటల నుంచి మహానాడు మొదలు కానుంది. దీంతో నగర అలంకరణ పనులు 26వ తేదీ నాటికే పూర్తి చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీ ఆయా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అలంకరణ పనులు జరగనున్నాయి.అలంకరణ బాధ్యతలు నగర పరిధిలోని శాసనసభ్యులకు అప్పగించారు. ఇదిలావుంటే మహానాడు బాధ్యతలను అందరు నిబద్ధతతో నిర్వహించాలని మహానాడు ప్రాంగణ పర్యవేక్షణ కమిటీ కన్వీనర్‌, ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేందప్రసాద్‌  అన్నారు. కమిటీలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక బాధ్యతలు ఉంటాయని ప్రతి విభాగంలో సైనికుల్లా క్రమశిక్షణతో పని చేయాలన్నారు. ఆహ్వానితులకు తగిన గౌరమిచ్చి సాదరంగా ఆహ్వానించాలని వలంటీర్లుకు సూచించారు. ఎమ్మెల్యే బోడేప్రసాద్‌ మాట్లాడుతూ సభ్యులంతా మహానాడు జరిగే రోజుల్లో నిర్వహణ అంతా పక్పందీగా ఉండేలా చూడాలని కోరారు. మహానాడు నిర్వహణ, ఏర్పాట్ల పర్యవేక్షణ, వలంటీర్ల పనితీరు, వసతి, భోజనాల సౌకర్యం, పార్కింగ్‌, ప్రాంగణ పరిశుభ్రత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.