Monday, 2 November 2026

అనుమానస్పద వ్యక్తులను రానివ్వం

అ1-trumpమెరికా నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు తమ ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తుందని ఆ దేశ తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం స్పష్టం చేశారు. మతదురభిమానం, దురభిప్రాయాలను తిప్పికొట్టి దేశమంతా ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటీవల విజయం సాధించిన ట్రంప్ కీలక రాష్టమ్రైన ఓహియో నుంచి తన తొలి విజయోత్సవ ర్యాలీని ప్రారంభించారు. ఇస్లామిక్ ఉగ్రవాదం గురించి ట్రంప్ మాట్లాడుతూ, ‘మధ్యప్రాచ్య దేశాల నుంచి ఎంతో మంది మన దేశంలోకి తరలివస్తున్నారు. వారు ఎవరో, ఎటువంటి వారో, ఎక్కడి నుంచి వస్తున్నారో, ఏ ఆలోచనలతో వస్తున్నారో మనకు తెలియదు. ఇటువంటి వివరాలను తెలుసుకోకుండా ఎవరినీ దేశంలోకి రానీయడం శ్రేయస్కరం కాదు.  దేశంలోకి రానీయకుండా మనం అడ్డుకుని తీరాలి. కనుక మీ రాష్ట్రంలో ఏమి జరుగుతోందనే విషయాన్ని ఎప్పుడూ నిశితంగా గమనిస్తూ అనునిత్యం అప్రమత్తంగా ఉండాలి’ అని స్పష్టం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *