Monday, 2 November 2026

ఈ రోజు నుండి టోల్‌ చార్జీలు

lekki-toll-gateహైదరాబాద్‌ మహానగరం చుట్టూ ఉన్న ఔటర్‌ రింగు రోడ్డుపై లను శనివారం నుంచి వసూలు చేయనున్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చిల్లర సమస్య మూలంగా నవంబర్‌ 9నుంచి డిసెంబర్‌ 2వరకు 23రోజుల పాటు టోల్‌ చార్జీల వసూలును నిలిపి వేశారు. కేంద్ర ప్రభుత్వం సైతం జాతీయ రహదారులపై టోల్‌ చార్జీలను వసూలు చేస్తుండడంతో హెచ్‌ఎండీఏ సైతం ఓఆర్‌ర్‌పై టోల్‌ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికీ చిల్లర సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో క్యాష్‌లెస్‌ సేవల కోసం పాయుంట్‌ ఆఫ్‌ సేల్స్‌(పీఓఎస్‌) యంత్రాలను వినియోగించాలని టోల్‌ ప్లాజా నిర్వాహకులకు హెచ్‌ఎండీఏ అధికారులు సూచించారు. దీంతో 158కి.మీ ఓఆర్‌ఆర్‌పై 19 ఇంటర్‌చేంజ్‌లు ఉండగా వాటిలో 15చోట్ల టోల్‌ చార్జీల వసూలు కోసం టోల్‌ బూతలు ఉన్నా యి. వీటిలో అన్ని చోట్ల పీఓఎస్‌ యంత్రాలను వాడి డెబిట్‌, క్రెడిట్‌ కార్డు ల ద్వారా చెల్లింపులు చేసే ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *