అపరిశుభ్రతకారణంగా ఓరిస్ ¬టల్ సీజ్
హైదరాబాద్,ఏప్రిల్5(జనంసాక్షి): హైదరాబాద్ ¬టళ్లపై నగరపాలక సంస్థ దృష్టి సారించింది. బడా ¬టళ్లుగా చెలామణి అవుతున్న అనేక ¬టళ్లు కనీస పరిశుభ్రత కూడా పాటించడంలేదు. పైన పటారం లోన లొటారం అన్నచందంగా ధనార్జనే ధ్యేయంగా నడుస్తున్నాయని తేలిపోయింది. పరిశుభ్రత లేని కారణంగా పేరొందిన ఓరీస్ ¬టల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న ఓరిస్ ¬టల్‌ను మంగళవారం నగర పాలక సంస్థ అధికారులు పరిశీలించారు.¬టల్ వంటగదిలో మురుగు నీరు వెల్లువలా వస్తోంది. అయినా వాటిని శుభ్రం చేయించకుండా అలాగే రెస్టారెంట్‌ను నిర్వహించడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట గది దుస్థితి చూసిన అధికారులు ఓరీస్ ¬టల్‌ను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ¬టల్ ఇక్కడ బాగా ప్రాచుర్యం పొందింది. దీంతో దీనికి వచ్చే కస్టమర్లు కూడా ఎక్కువే. ఉదయం తనిఖీలో ఇదంతా డొలల్ అని తేలడంతో ¬టల్‌ను సీజ్ చేశారు.