విశాఖ: అసోంలో అపహరణకు గురైన ఆంధ్రా ఇంజినీర్‌ను పైడిరాజు విడుదలయ్యారు. మంగళవారం రాత్రి బోడో తీవ్రవాదులు అయన్ను విడిచిపెట్టారు. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న పైడిరాజును దిగువ అస్సాంలోని బక్సా జిల్లాలో గత శనివారం గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అహరించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పైడిరాజను బోడో తీవ్రవాదులు విడుదల చేశారు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.




